WPL Full Schedule 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి (WPL Full Schedule 2025) సమయం ఆసన్నమైంది. లీగ్ మూడవ సీజన్ ఫిబ్రవరి 14 శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది. ఫైనల్ మార్చి 15న జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. మూడవ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లు 4 వేదికలలో జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు వడోదర, బెంగళూరు, లక్నో మరియు ముంబైలలో జరుగుతాయి. గ్రూప్ దశలో 20 మ్యాచ్‌లు ఆడతారు. దీని తర్వాత రెండు నాకౌట్ మ్యాచులు జరుగుతాయి. అయితే ఈ ప్రీమియర్ లీగ్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఆ తర్వాత నాకౌట్ దశ ఉంటుంది. రౌండ్-రాబిన్ దశలో ఐదు జట్లు ప్రతి ఒక్కటి ఇతర జట్లతో రెండుసార్లు తలపడతాయి. గెలిచిన జట్టుకు 2 పాయింట్లు లభిస్తాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో పాల్గొనబోయే జట్లు
- గుజరాత్ జెయింట్స్
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- ముంబై ఇండియన్స్
- ఢిల్లీ క్యాపిటల్స్
- యూపీ వారియర్స్
Also Read: ICC Bans Shohely Akhter: బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్‌కు ఊహించని షాక్.. ఐదేళ్లపాటు నిషేధం!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్
వడోదర – కోటంబి స్టేడియం
- ఫిబ్రవరి 14: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాత్రి 7:30
- ఫిబ్రవరి 15: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, రాత్రి 7:30
- ఫిబ్రవరి 16: గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్స్, రాత్రి 7:30 గంటలకు
- ఫిబ్రవరి 17: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాత్రి 7:30
- ఫిబ్రవరి 18: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్, రాత్రి 7:30
- ఫిబ్రవరి 19: యుపి వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, రాత్రి 7:30 గంటలకు
- బెంగళూరు – ఎం చిన్నస్వామి స్టేడియం
- ఫిబ్రవరి 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్, రాత్రి 7:30
- ఫిబ్రవరి 22: ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్స్, రాత్రి 7:30 గంటలకు
- ఫిబ్రవరి 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్స్, రాత్రి 7:30
- ఫిబ్రవరి 25: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్, రాత్రి 7:30
- ఫిబ్రవరి 26: ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్స్, రాత్రి 7:30
- ఫిబ్రవరి 27: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్, రాత్రి 7:30
- ఫిబ్రవరి 28: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్, రాత్రి 7:30
- మార్చి 1: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, రాత్రి 7:30
లక్నో – ఎకానా క్రికెట్ స్టేడియం
- మార్చి 3: యుపి వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్, రాత్రి 7:30 గంటలకు
- మార్చి 6: యుపి వారియర్స్ vs ముంబై ఇండియన్స్, రాత్రి 7:30
- మార్చి 7: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, రాత్రి 7:30
- మార్చి 8: యుపి వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాత్రి 7:30
ముంబై – బ్రాబోర్న్ స్టేడియం
- మార్చి 10: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్, రాత్రి 7:30
- మార్చి 11: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాత్రి 7:30
- నాకౌట్ మ్యాచ్- బ్రబోర్న్ స్టేడియం, ముంబై
- మార్చి 13: ఎలిమినేటర్, రాత్రి 7:30 గంటలకు
- మార్చి 15: ఫైనల్, రాత్రి 7:30 గంటలకు