WPL 2026 Opening Match: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే హై-ప్రొఫైల్ పోరుతో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ మ్యాచ్ నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, 2024 విజేత అయిన స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సిబి కూడా శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డు
రెండు జట్లలోనూ అనుభవజ్ఞులైన స్టార్ ప్లేయర్లు, ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులు ఉండటంతో ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. గత రికార్డులను పరిశీలిస్తే.. ముంబైకి స్వల్ప ఆధిక్యం ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు తలపడిన 7 మ్యాచ్‌ల్లో ముంబై 4 గెలిస్తే, ఆర్‌సిబి 3 విజయాలను సాధించింది.
పిచ్- వాతావరణ రిపోర్ట్
వాతావరణం సాధారణంగా ఉంటుందని, ఆకాశం స్పష్టంగా కనిపిస్తుందని అంచనా. ఉష్ణోగ్రత కూడా ఓ మోస్తరుగా ఉంటుంది. వర్షం వచ్చే అవకాశం తక్కువ. రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురిసే అవకాశం ఉన్నందున ఛేజింగ్ చేసే జట్లకు అది అనుకూలించవచ్చు. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు సుమారు 150-160 పరుగులుగా ఉంటుంది.
Also Read: అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?
జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11
ముంబై ఇండియన్స్: హీలీ మాథ్యూస్, నతాలీ సైవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, అమేలియా కెర్, జి కమలిని (వికెట్ కీపర్), షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, సజీవన్ సజన, సంస్కృతి గుప్త, పూనమ్ ఖేమ్నార్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), నాడిన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్, పూజ వస్త్రాకర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, జార్జియా వోల్, లారెన్ బెల్, గౌతమి నాయక్, లిన్సే స్మిత్.
మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ముంబై- ఆర్‌సిబి మధ్య జరిగే ఈ ప్రారంభ మ్యాచ్ టాస్ జనవరి 9న సాయంత్రం 7 గంటలకు పడుతుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
టీవీ ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network).
లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ (JioHotstar).
ఓపెనింగ్ సెర్మనీ: సాయంత్రం 6:45 గంటలకు ప్రారంభ వేడుకలు ఉంటాయి. ఇందులో సింగర్ హనీ సింగ్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
