Site icon HashtagU Telugu

WPL 2024: టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ

WPL 2024

WPL 2024

WPL 2024: టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ దూసుకెళుతుంది. మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆర్సీబీ తరుపున శ్రేయాంక పాటిల్ నాలుగు వికెట్లు, సోఫీ మోలినెక్స్ మూడు వికెట్లు , మలయాళీ ప్లేయర్ ఆశా శోభన రెండు వికెట్లు పడగొట్టి ఢిల్లీ బ్యాటింగ్ దళాన్ని నేలకూల్చారు.

27 బంతుల్లో మూడు సిక్స్‌లు, 2 ఫోర్లతో 44 పరుగులు చేసిన షెఫాలీ వర్మ వికెట్‌ తొలుత పడింది. మోలినెక్స్ వేసిన బంతిని జార్జియా వెరెహామ్ క్యాచ్ అందుకుంది. దీంతో ఢిల్లీ పతనం మొదలైంది. జట్టు స్కోరు 74 పరుగులకు చేరుకునే సరికి కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా వెనుదిరగగా.. మూడు బంతుల్లో ఐదు పరుగులు చేసిన మిన్ను మణిని శ్రేయాంక పాటిల్ వికెట్ ముందు ట్రాప్ చేసింది. మరిసైన్ కాప్ (8), జెస్ జోనాసన్ (3), రాధా యాదవ్ (12), అరుంధతి రెడ్డి (10), శిఖా పాండే (5 నాటౌట్) మరియు తానియా భాటియా (0) చేశారు. అయితే ఆశా శోభన కేవలం మూడు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది.

113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 15 ఓవర్ల సమయానికి 1 వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. సోఫియా 27 బంతుల్లో 32 పరుగులు చేసింది.స్మృతి మంధాన 31 పరుగులు వద్ద అవుట్ అయింది.

Also Read: WPL 2024: టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ