మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాథన్ లియాన్‌ను అవుట్ చేసి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన బుమ్రా ప్రస్తుత సిరీస్‌లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు. తద్వారా సిరీస్‌లో మూడోసారి 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియాతో టెస్టు క్రికెట్‌లో బుమ్రా 5 వికెట్లు తీయడం ఇది 13వ సారి. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ అక్తర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇది కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో బుమ్రా భారీ రికార్డు నమోదు చేశాడు. డబ్ల్యూటీసి చరిత్రలో 10 సార్లు 5 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి షోయబ్ అక్తర్ 12 సార్లు 5 వికెట్లు తీసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి బుమ్రా 13వ సారి ఈ ప్రత్యేక ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు బుమ్రా 44 టెస్టు మ్యాచ్‌లు ఆడి 203 వికెట్లు పడగొట్టగా, అక్తర్ తన కెరీర్‌లో 46 మ్యాచ్‌ల్లో 178 వికెట్లు తీశాడు. ఇది మాత్రమే కాదు అతను శ్రీలంక చమిందా వాస్ మరియు ఆస్ట్రేలియన్ లెజెండ్ మిచెల్ జాన్సన్‌లను సైతం అధిగమించాడు. వారు తమ కెరీర్‌లో 12 సార్లు ఐదు వికెట్లు పడగొట్టారు. ఇప్పుడు 13వ సారి ఐదు వికెట్లు తీసి బుమ్రా వెస్టిండీస్‌కు చెందిన మైఖేల్ హోల్డింగ్ మరియు పాకిస్తాన్‌కు చెందిన సక్లైన్ ముస్తాక్‌ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. వీరు తమ కెరీర్‌లో 13 సార్లు ఈ ఘనత సాధించారు.
జస్ప్రీత్ బుమ్రా తన టెస్టు కెరీర్‌లో 13వ సారి 5 వికెట్లు తీశాడు. అదే సమయంలో బుమ్రా ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం డబ్ల్యూటీసి హిస్టరీలో ఇది 10వ సారి. అదే సమయంలో ఆసియా ఆటగాడిగా అత్యధికంగా 5 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఏడాదిలో నాలుగుసార్లు ఐదు వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. న్యూలాండ్స్, కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన న్యూ ఇయర్ టెస్టులో అతను ఐదు వికెట్లు తీయగా, ఈ సిరీస్‌లో ముగ్గురు బౌలర్లు ఈ ఘనత సాధించారు. ఇది కాకుండా బుమ్రా టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై భారత్ తరఫున అత్యధిక ఐదు వికెట్లు తీసిన సంయుక్త రెండో బౌలర్‌గా నిలిచాడు.