world cup 2023: భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే శ్రీలంక ఆలౌట్

ముంబైలోని వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక భారీ తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది.

Published By: HashtagU Telugu Desk
India Enter Semi Finals

World Cup 2023 (75)

world cup 2023: ముంబైలోని వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక భారీ తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ఒక ఫోర్ కొట్టి పెవిలియన్ చేరగా, శుభ్‌మన్ గిల్ 92 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. విరాట్ కోహ్లీ 88 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో శ్రీలంక తరఫున దిల్షాన్ మధుశంక ఐదు వికెట్లు పడగొట్టాడు.

358 భారీ లక్ష్యఛేదనలో శ్రీలంక ఆరంభం నుంచే తడబడింది. టీమిండియా బౌలింగ్ విభాగం ముందు లంక బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత్ 302 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. భారత్ తరుపున షమీ ఐదు వికెట్లు తీశాడు. సిరాజ్ 3, బుమ్రా 1, జడేజా 1 వికెట్లు పడగొట్టారు. దీంతో శ్రీలంక జట్టు మొత్తం 55 పరుగులకే ఆలౌట్ అయింది. లంక 19.4 ఓవర్లకె చాపచుట్టేసింది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, దుష్మంత హేమంత, ఏంజెలో మాథ్యూస్, దుష్మంత చమీర, మహిష్ తీక్షణ, కసున్ రజిత్ మరియు దిల్షన్ మధుశంక

Also Read: Telangana Poll Queries : గూగుల్ లో ఎక్కువగా కేసీఆర్, రేవంత్ లనే సెర్చ్ చేస్తున్నారట..

  Last Updated: 02 Nov 2023, 09:01 PM IST