Site icon HashtagU Telugu

World Cup 2023: ప్రపంచ కప్ లో భారత్ బోణి.. ఆసీస్ చిత్తు

World Cup 2023 (20)

World Cup 2023 (20)

World Cup 2023: చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. టాపార్డర్ కుప్పకూలాగా, మిడిల్ ఆర్డర్ జట్టుని ఆదుకుంది.  రోహిత్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ జీరో స్కోరుతో వెనుదిరగడంతో ఆటగాళ్లలో ఒక్కసారిగా నిరాశ కనిపించింది. కానీ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ స్టాండ్ ఇచ్చి ఒక్కో పెరుగుని ఒక్కో డైమండ్ లా మలిచారు. సింగిల్స్ తీస్తూ జట్టుని విజయతీరాలకు చేర్చారు. చివరి వరకూ మ్యాచ్‌ను నిలబెట్టిన విరాట్‌ కోహ్లీ 85 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. కోహ్లీ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా సహకారంతో.. 52 బంతులు మిగిలి ఉండగానే కేఎల్ రాహుల్ (97) చివరి బంతి సిక్సర్ కొట్టి ప్రపంచ కప్ లో బోణి అందించాడు. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన కేఎల్ రాహుల్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుపై చాపచుట్టేసింది. ఆసీస్‌ 49.3 ఓవర్లకు 199 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ విరాట్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత వార్నర్‌, స్మిత్‌ నిలకడగా రాణించారు. ఇద్దరి భాగస్వామ్యం కారణంగా స్కోర్ ఆ మాత్రం రాబట్టారు. డేవిడ్‌ వార్నర్‌ 52 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో స్టీవ్‌ స్మిత్‌ రాణించాడు. 71 బంతులు ఎదుర్కొన్న అస్మిత్ 46 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. లబుషేన్‌ (27), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (15), పాట్‌ కమ్మిన్స్‌ (15) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దీంతో ఆసీస్ భారీ స్కోర్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సో మొత్తానికి 2023 ప్రపంచ కప్ లో టీమిండియా మొదటి విజయంతో బోణి కట్టింది.

Also Read: kodandaram : కాంగ్రెస్ తో కోదండరాం పొత్తు..?