Site icon HashtagU Telugu

Spot Fixing: ఉమెన్స్‌ టీ20 ప్రపంచకప్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కలకలం

Bangladesh

Resizeimagesize (1280 X 720) (1) 11zon

సాతాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ (Spot Fixing) వార్తలు కలకలం రేపాయి. ఓ బంగ్లాదేశీ ప్లేయర్‌ను ఫిక్సర్లు సంప్రదించినట్లు ఓ సంస్థ వెల్లడించింది. దీనిపై బంగ్లాదేశ్‌కు చెందిన మీడియా.. ఆడియో రికార్డింగ్‌లను రిలీజ్‌ చేసినట్లు పేర్కొంది. ‘ఈ ఆఫర్‌ను ఆమె తిరస్కరించి ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇందులో మరో బంగ్లా ప్లేయర్‌ మధ్యవర్తిగా వ్యవహరించారు’ అని పేర్కొంది. నిజానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ క్రీడాకారిణి స్పాట్ ఫిక్సింగ్‌పై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జమున టీవీ నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్ క్రీడాకారిణి లతా మండల్ తనకు స్పాట్ ఫిక్సింగ్ చేస్తానని షోహ్లే అక్తర్ ఆఫర్ చేశాడని సంచలనాత్మకంగా వెల్లడించింది. జమున టీవీ ఇద్దరు బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య జరిగిన ఆడియో సంభాషణను విడుదల చేసిందని మీడియా హౌస్ పేర్కొంది

ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి క్రీడాకారిణిని సంప్రదించిన విషయం తెరపైకి వచ్చింది. అయితే, ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక విభాగం ఈ విషయంపై దృష్టి పెట్టింది. త్వరలో విచారణ ప్రారంభించనుంది. మరోవైపు, అవినీతి నిరోధక విభాగానికి స్పాట్ ఫిక్సింగ్‌పై ఫిర్యాదు చేసిన క్రీడాకారిణి లతా మండల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

Also Read: T20 World Cup: మహిళల టీ ట్వంటీ వరల్డ్‌కప్‌.. భారత్‌కు రెండో విజయం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసింది కెప్టెన్ నిగర్ సుల్తానా. 50 బంతుల్లో 57 పరుగులు చేసింది. 108 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా తరఫున మెగ్ లానింగ్ అజేయంగా 48 పరుగులు చేయగా, అలిస్సా హీలీ 37 పరుగులు చేసింది.