మహిళల క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. 2026 మహిళల టీ20 వరల్డ్ కప్ (Women’s T20 World Cup) షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ ఇంగ్లండ్-వేల్స్ వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొనబోతుండగా, వాటిలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక వంటి దేశాలతో పాటు, గ్లోబల్ క్వాలిఫయర్స్‌లో విజయం సాధించే మరో 4 జట్లు అర్హత సాధించనున్నాయి.
Telangana : ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలి తెలంగాణ వాసి మృతి
ఈ 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, రెండు క్వాలిఫయర్ జట్లు ఉండగా, గ్రూప్-బీలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, మరో రెండు క్వాలిఫయర్ జట్లు ఉండనున్నాయి. జూన్ 12న ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది. టోర్నీ 24 రోజుల పాటు 7 వేదికల్లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో జులై 5న నిర్వహించనున్నారు. ప్రధాన వేదికలుగా ఎడ్జ్‌బాస్టన్, ఓల్డ్ ట్రఫోర్డ్, ది ఓవల్, హెడ్డింగ్లీ, హాంప్‌షైర్ బౌల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్‌లు ఎంపికయ్యాయి.
భారత్ జట్టు తొలి మ్యాచ్‌లోనే తన ప్రధాన ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఆ తర్వాత జూన్ 17న తొలి క్వాలిఫయర్ జట్టుతో, జూన్ 21న దక్షిణాఫ్రికాతో, జూన్ 25న రెండవ క్వాలిఫయర్ జట్టుతో, జూన్ 28న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీ ద్వారా భారత మహిళల జట్టు తమ ఫాంను నిరూపించుకునేందుకు, ప్రపంచ కప్ కిరీటాన్ని గెలుచుకునేందుకు మరింత ఉత్సాహంగా పోటీపడనుంది.