Site icon HashtagU Telugu

TATA: టాటా కే వుమెన్స్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌

Tata Group

Women's Ipl Title Sponsorship Goes To Tata Group

మహిళల ఐపీఎల్‌కు సన్నాహాలు మరింత ఊపందుకున్నాయి. లీగ్‌ను ప్రకటించినప్పటి నుంచీ బీసీసీఐ వడివడిగా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే ప్రసార హక్కులు, ఫ్రాంచైజీల అమ్మకం, క్రికెటర్ల వేలం పూర్తయిపోగా.. ఇప్పుడు లీగ్ స్పాన్సర్‌షిప్‌ అమ్మకాలపై దృష్టి పెట్టింది. మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రసార హక్కులు, ఫ్రాంచైజీలు రికార్డు స్థాయిలో అమ్ముడవడమే దీనికి ఉదాహరణ. తాజాగా వుమెన్స్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ హక్కుల అమ్మకం కూడా కంప్లీట్ అయింది. WPL టైటిల్ స్పాన్సర్‌షిప్ ను ప్రముఖ దేశీయ కంపెనీ టాటా (Tata) సొంతం చేసుకుంది. ఇప్పటికే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా ఉన్న టాటా.. ఇటు మహిళల ఐపీఎల్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు ఎంతకు అమ్ముడయ్యాయో ప్రకటించకున్నా.. గట్టిపోటీనే నడిచిందని సమాచారం. వచ్చే ఐదేళ్లకుగాను టాటా సన్స్ టైటిల్ స్పాన్సర్ హక్కులను సొంతం చేసుకుంది.

గతంలో వివో తప్పుకున్న తర్వాత ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులను టాటా (Tata) దక్కించుకుంది. అంతకుముందు నుంచే ఐపీఎల్‌లో భాగం కావాలని ప్రయత్నిస్తున్న ఈ దేశీయ దిగ్గజ కంపెనీ టైటిల్ స్పాన్సర్‌ ద్వారా అడుగుపెట్టింది. ఇప్పుడు మహిళల ఐపీఎల్‌లోనూ భాగం కావడం సంతోషంగా ఉందని టాటా తెలిపింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌ మార్చి 4 నుంచి 26 వరకూ జరగనుంది. ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లతో పాటు యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా లీగ్‌లో ఆడుతున్నాయి. తొలి సీజన్‌లో మొత్తం 20 మ్యాచ్‌లు జరగనుండగా…టాప్ లో నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఇదిలా ఉంటే లీగ్ ఆరంభానికి ముందే WPL రికార్డులు సృష్టిస్తోంది. మీడియా ప్రసార హక్కులను రికార్డు స్థాయిలో 951 కోట్ల రూపాయలకు వయాకామ్ సంస్థ కొనుగోలు చేసింది. ఇక ఫ్రాంచైజీల అమ్మకం ద్వారా బీసీసీఐ జాక్‌పాట్ కొట్టింది. రూ.4670 కోట్లకు ఐదు ఫ్రాంచైజీలు అమ్ముడయ్యాయి.

Also Read:  Vivek Ramaswamy: 2024 US ప్రెసిడెన్షియల్ బిడ్‌ను ప్రకటించిన వివేక్ రామస్వామి