Site icon HashtagU Telugu

Women’s Asia Cup: బంగ్లాదేశ్ మహిళలపై భారత్ విజయం

Women Cricket

Women Cricket

మహిళల ఆసియాకప్ లో భారత జట్టు మళ్ళీ విజయాల బాట పట్టింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత పాక్ జట్టు చేతిలో ఓడిన భారత్ తాజాాగా బంగ్లాదేశ్ పై భారీ విజయాన్ని అందుకుంది. పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ 59 రన్స్ తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, కెప్టెన్ స్మృతి మంధాన మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 12 ఓవర్లలో 96 పరుగులు జోడించారు. స్మృతి 47 , షెఫాలీ 55 పరుగులు చేయగా.. తర్వాత రోడ్రిక్స్ కూడా రాణించింది.

రోడ్రిక్స్ 24 బంతుల్లో 4 ఫోర్లతో 37 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. ఛేజింగ్ లో బంగ్లాదేశ్ ను ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టడి చేశారు. వికెట్లు చేజార్చుకోవప్పటకీ సింగిల్స్ కు మాత్రమే పరిమితమైంది. తొలి వికెట్ కు ఓపెనర్లు 45 పరుగులు జోడించగా.. టాపార్డర్ మాత్రమే పర్వాలేదనిపించింది. మిగిలిన బ్యాటర్లు భారత బౌలర్ల దాటికి పరుగులు చేయలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 100 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా… షెఫాలీ వర్మ 10 పరుగులకు 2 వికెట్లు పడగొట్టింది. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.