MS Dhoni : ధోనీని ఊరిస్తున్న భారీ రికార్డులివే..

ఐపీఎల్‌-2022లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపనుంది.

  • Written By:
  • Publish Date - May 4, 2022 / 05:25 PM IST

ఐపీఎల్‌-2022లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కొన్ని వ్యక్తిగత రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లో ఒకే జట్టుకు 200 మ్యాచ్‌లు ఆడిన రెండో ప్లేయర్ గా ధోని రికార్డు సాదించనున్నాడు. ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో కోహ్లీ ఇప్పటివరకు 217 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఈ మెగా టోర్నీలో భాగంగా ఐపీఎల్ 2016, 2017 సీజన్లలో ధోనీ 30 మ్యాచ్‌లు పుణె జట్టు తరఫున ఆడాడు.

ఇక ఐపీఎల్ హిస్టరీలో ఆర్సీబీపై ధోనీ ఇప్పటివరకు 836 పరుగులు సాధించాడు. ఇందులో 46 సిక్స్‌లు ఉన్నాయి. అయితే ధోని ఈ మ్యాచ్ లో మరో నాలుగు సిక్స్‌లు బాదితే ఐపీఎల్ లో ఒక జట్టుపై 50 సిక్స్‌లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సాధిస్తాడు.
అలాగే టీ20ల్లో కెప్టెన్‌గా ధోనీకి ఇది 302వ మ్యాచ్‌గా ఉండగా… ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు కెప్టెన్ గా 5994 పరుగులు సాధించిన ధోనీ.. మరో 6 పరుగులు చేస్తే 6వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా పటిష్టంగా ఉంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు జట్టు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. సీఎస్‌కేతో మ్యాచ్‌లో తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి అవకాశం ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ షయానికి వస్తే.. బ్యాటింగ్‌ పరంగా రాణిస్తున్నప్పటికీ.. బౌలర్లు మాత్రం విఫలమవుతున్నారు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 6 ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.