Beer Company: బీర్ కంపెనీతో రూ. 66 కోట్ల డీల్ చేసుకున్న ఐసీసీ..!

ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ నేటి నుండి ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరూ తమ లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మద్యం, బీరు కంపెనీలు (Beer Company) కూడా ఇందులో వెనకడుగు వేయడం లేదు.

Published By: HashtagU Telugu Desk
ODI World Cup 2027

World Cup 2023

Beer Company: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ నేటి నుండి ప్రారంభం కానుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రపంచకప్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ గత సారి విజేత ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈసారి ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు తమ సంపదను రెట్టింపు చేసుకోవడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాయి. అందులో OTT యాప్‌లు, ట్రావెల్ బుకింగ్ వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ గేమింగ్ యాప్‌లు కావచ్చు. ప్రతి ఒక్కరూ తమ లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మద్యం, బీరు కంపెనీలు (Beer Company) కూడా ఇందులో వెనకడుగు వేయడం లేదు. ఐసీసీ నిర్వహిస్తున్న ఈ వన్డే ప్రపంచకప్‌లో కోట్లాది రూపాయల మద్యం, బీరు వ్యాపారం జరగనుంది.

బీర్ కంపెనీతో 66 కోట్ల డీల్..!

వాస్తవానికి ఈ ప్రపంచ కప్‌ను నిర్వహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పెద్ద కంపెనీలతో ICC స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు చేసుకుంది. వీటిలో బీర్ కంపెనీ బీరా 91, లిక్కర్ కంపెనీ రాయల్ స్టాగ్ ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు ఐసీసీతో స్పాన్సర్‌షిప్ ఒప్పందం కింద కోట్లాది రూపాయల డీల్‌ చేసుకున్నాయి. ఇప్పుడు ఈ ఒప్పందాల కంపెనీల గురించి కొంతమేర సమాచారాన్నితెలుసుకుందాం.

Also Read: IND vs AUS: చెన్నైకు చేరుకున్న టీమిండియా.. ఆసీస్ ను ఓడించడమే లక్ష్యంగా ప్రాక్టీస్

We’re now on WhatsApp. Click to Join.

వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కోసం 8 అధికారిక భాగస్వాములతో ICC స్పాన్సర్‌షిప్ ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ ఎనిమిది మంది భాగస్వాములతో 60 నుంచి 80 లక్షల డాలర్లు అంటే గరిష్టంగా రూ.66 కోట్ల విలువైన డీల్ జరిగింది. ఈ ఎనిమిది కంపెనీల్లో బీర్ కంపెనీ ‘బిరా 91’ ఒకటి. ఈ బీర్ కంపెనీ కాకుండా అధికారిక భాగస్వాముల జాబితాలో Thums-Up, Nissan, Oppo, Polycab, Upstox, Niam, DP వరల్డ్ ఉన్నాయి.

మద్యం కంపెనీతో రూ.33 కోట్ల ఒప్పందం..!

అధికారిక భాగస్వాములే కాకుండా ఈ ప్రపంచ కప్ కోసం కేటగిరీ భాగస్వాముల కోసం ICC స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను కూడా చేసింది. ఈ డీల్ కింద ఒక్కో బ్రాండ్‌తో దాదాపు 30 నుంచి 40 లక్షల డాలర్లు అంటే గరిష్ఠంగా రూ.33 కోట్ల విలువైన డీల్ జరిగింది. ఈ వర్గం భాగస్వాముల జాబితాలో మద్యం కంపెనీ రాయల్ స్టాగ్ కూడా చేర్చబడింది. ఇదే కాకుండా డ్రీమ్-11, టైకా, నియర్ ఫౌండేషన్ వంటి కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

  Last Updated: 05 Oct 2023, 02:02 PM IST