T20 World Cup: టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం అన్ని జట్లూ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. అటు ఆతిథ్య ఆస్ట్రేలియా ఏర్పాట్లో నిమగ్నమవగా.. ఇటు ఐసీసీ టోర్నీ ప్రైజ్ మనీని ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 02:52 PM IST

టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం అన్ని జట్లూ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. అటు ఆతిథ్య ఆస్ట్రేలియా ఏర్పాట్లో నిమగ్నమవగా.. ఇటు ఐసీసీ టోర్నీ ప్రైజ్ మనీని ప్రకటించింది. దీని ప్రకారం విజేతగా ఈసారి భారీ మొత్తంలోనే ప్రైజ్ మనీ దక్కనుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకునే జట్టు 13 కోట్ల 5 లక్షల రూపాయలు అందుకోనుంది. అలాగే రన్నరప్ గా నిలిచే జట్టుకు 6 కోట్ల 52 లక్షల 64 వేల రూపాయలు లభించనుంది. సెమీఫైనలిస్టులకు 3 కోట్ల 26 లక్షల చొప్పను, సూపర్ 12 లో గెలిచిన జట్టుకు 32 లక్షల 62 వేల రూపాయలు, ఓడిన జట్టుకు 57 లక్షల 8వేల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కనున్నాయి. ఇక మొదటి రౌండ్ లో గెలిచిన జట్టుకు
ఓడిన జట్లకు 32 లక్షల 62 వేలు ప్రైజ్ మనీగా లభించనుంది. మొత్తంగా ఈ టోర్నీ ప్రైజ్ మనీగా 45 కోట్ల రూపాయలు ఐసీసీ అందించబోతోంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా…భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ , న్యూజిలాండ్, ఆప్ఘనిస్థాన్ సూపర్ 12కు నేరుగా అర్హత సాధించాయి. అయితే వెస్టిండీస్, శ్రీలంక, యూఏఈ, నమీబియా, నెదర్లాండ్స్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ క్వాలిఫైయర్స్‌లో తలపడనున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది. అక్టోబర్ 23న జరగనున్న ఈ పోరుకు మెల్ బోర్న్ ఆతిథ్యమివ్వనుంది.