Tim Southee: కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారా..? స‌మాధాన‌మిచ్చిన టిమ్ సౌథీ..!

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టిమ్ సౌథీ (Tim Southee) నేతృత్వంలోని కివీస్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

  • Written By:
  • Updated On - March 12, 2024 / 07:31 AM IST

Tim Southee: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టిమ్ సౌథీ (Tim Southee) నేతృత్వంలోని కివీస్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత టిమ్ సౌథీ కెప్టెన్సీపై వరుసగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే న్యూజిలాండ్.. భారత పర్యటనకు ముందు టిమ్ సౌథీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారా? ఈ ప్రశ్నకు టిమ్ సౌథీ స్వయంగా సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత టిమ్ సౌథీ మాట్లాడుతూ.. భారత్, అఫ్గానిస్థాన్‌లతో జరిగే సిరీస్‌లలో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉంటానన్న గ్యారెంటీ లేదని చెప్పాడు.

ఆసియా గడ్డపై స్పిన్ బౌలర్లపై ఆడటం పెద్ద సవాల్ అని, ఆ సమయంలో మా ప్ర‌ణాళిక‌లు మాకు ఉంటాయ‌ని టిమ్ సౌథీ అన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో న్యూజిలాండ్ 172 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో టిమ్ సౌథీ నేతృత్వంలోని కివీస్ జట్టుపై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ ఓటమి తర్వాత టిమ్ సౌథీ కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, టిమ్ సౌథీ తన కెప్టెన్సీ భవిష్యత్తుపై ఈ ప్రకటన చేశాడు.

Also Read: Telangana: బిడ్డా.. గుర్తుపెట్టుకో మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే: సీఎం రేవంత్

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో కివీస్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 256 పరుగులు చేసింది. అయితే దీని తర్వాత న్యూజిలాండ్ అద్భుతంగా పునరాగమనం చేసి రెండో ఇన్నింగ్స్‌లో 372 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 281 పరుగుల విజయ లక్ష్యం నిర్ణ‌యించింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా 7 వికెట్లకు 281 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా జట్టు 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయినా.. ఆ తర్వాత మిచెల్ మార్ష్, అలెక్స్ కారీలు అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.

We’re now on WhatsApp : Click to Join