Virat Kohli & Rohit Sharma: ఆ ఇద్దరికీ ఇదే చివరి టీ ట్వంటీనా? పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే ఛాన్స్..!

  • Written By:
  • Updated On - June 29, 2024 / 12:59 PM IST

Virat Kohli & Rohit Sharma: టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పదేళ్ళ తర్వాత ఫైనల్ చేరిన భారత్ టైటిల్ కోసం సఫారీలతో తలపడనుంది. పొట్టి క్రికెట్ లో 17 ఏళ్ళ తర్వాత విశ్వవిజేతగా నిలిచే అరుదైన అవకాశం ముంగిట ఉన్న భారత్ కు ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అయితే ఈ మెగా టోర్నీతో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ టీ ట్వంటీ కెరీర్ కు తెరపడబోతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli & Rohit Sharma)లకు అంతర్జాతీయ టీ ట్వంటీల్లో ఇదే చివరి మ్యాచ్ కానుందని సమాచారం. నిజానికి 2022 టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్ టీమ్ కు వీరిద్దరూ దూరమయ్యారు.

యువక్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు వీరిద్దరూ తప్పుకున్నారు. అయితే ఆ సారి ప్రపంచకప్ కు స్వదేశంలో టీ ట్వంటీ సిరీస్ ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. వరల్డ్ కప్ జట్టులో కోహ్లీ, రోహిత్ ఉండాలన్న చాలా మంది ప్రతిపాదనకు సెలక్టర్లు కూడా మొగ్గుచూపడంతో మెగా టోర్నీకి ఎంపికయ్యారు. ప్రస్తుత టోర్నీలో జట్టును అద్భుతంగా నడిపిస్తున్న రోహిత్ శర్మ వ్యక్తిగతంగానూ ఫామ్ అందుకున్నాడు. అయితే కోహ్లీ మాత్రం నిరాశపరిచాడు. ఇప్పుడు ఫైనల్లో సఫారీలపై వీరిద్దరూ చెలరేగడం ద్వారా ట్రోఫీ గెలిచి టీ ట్వంటీ కెరీర్ ను గ్రాండ్ ముగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: India Women: చ‌రిత్ర సృష్టించిన భార‌త్.. ఒకే రోజులో ఎక్కువ ప‌రుగులు చేసిన రెండో జ‌ట్టుగా రికార్డు..!

2010లో జింబాబ్వేపై టీ ట్వంటీ అరంగేట్రం చేసిన కోహ్లీ ఇప్పటి వరకూ 124 మ్యాచ్ లలో 4112 పరుగులు చేశాడు. దీనిలో 37 హఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. అటు 2007లో ఇంగ్లాండ్ పై పొట్టి ఫార్మాట్ లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటి వరకూ 158 మ్యాచ్ లలో 4222 పరుగులు చేశాడు. దీనిలో 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా వరల్డ్ కప్ ఫైనల్ ఫలితం ఎలా ఉన్న వయసును దృష్టిలో పెట్టుకుంటే రోహిత్ , విరాట్ ఇద్దరు టీ ట్వంటీ కెరీర్ పై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

We’re now on WhatsApp : Click to Join