MI vs DC: రేపు వాంఖడేలో మిస్టర్ 360 ఎంట్రీ?

కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకునేందుకు సూర్య కుమార్ యాదవ్ బయలుదేరుతున్నాడు . గాయం కారణంగా ఎన్​సీఏలో కోలుకుంటున్న సూర్య పూర్తి ఫిట్​నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఎన్​సీఏ నుంచి అతడు క్లియరెన్స్ కూడా పొందినట్లు తెలుస్తోంది.

MI vs DC: హార్దిక్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశాపరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లు ఓడి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది.ఇది హార్దిక్ ని తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తుంది. గుజరాత్ టీం కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకున్న పాండ్యా ముంబై ఇండియన్స్ విషయంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యాను ఎగతాళి చేస్తున్నారు. హార్దిక్ చేసే ప్రతీ పనిలో తప్పును వెతుకుతున్నారు. స్టేడియంలో అనేక సార్లు ప్రేక్షకులు హార్దిక్‌ను చూసి రోహిత్ శర్మకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో హార్దిక్ కాళ్లలో నీళ్లు తిరిగిన సందర్భాలున్నాయి. ఫ్యాన్స్ ఉండాలి కానీ యాంటీ ఫ్యాన్స్ ద్వారా ఒక మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బ తింటుందని కొందరు తెలుసుకోలేకపోతున్నారు. ఒత్తిడి కారణంగా మైదానంలో హార్దిక్ పాండ్యా స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు.

ముంబై తదుపరి మ్యాచ్‌ ఏప్రిల్‌ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జట్టుకు లాంగ్‌ బ్రేక్‌ దొరికింది. దీంతో జట్టు సభ్యులంతా రిలాక్స్ అవుతున్నారు. కానీ హార్దిక్ మాత్రం దేవుడిపై భారం వేశాడు. వరుస ఓటములతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా.. ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ఆ శివుడిని వేడుకున్నాడు.

We’re now on WhatsAppClick to Join

కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకునేందుకు సూర్య కుమార్ యాదవ్ బయలుదేరుతున్నాడు . గాయం కారణంగా ఎన్​సీఏలో కోలుకుంటున్న సూర్య పూర్తి ఫిట్​నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఎన్​సీఏ నుంచి అతడు క్లియరెన్స్ కూడా పొందినట్లు తెలుస్తోంది. ముంబై తన నాలుగో మ్యాచ్‌ని ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మరోవైపు వాంఖడే సూర్యకుమార్‌కు హోమ్ గ్రౌండ్. కాబట్టి సూర్య తన సొంత గ్రౌండ్ లోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతోన్న సూర్య బరిలోకి దిగితే ముంబై ఇండియన్స్‌ పరిస్థితి పూర్తిగా మారొచ్చు. మరి ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సత్తా ఉన్న సూర్య రాకతో ముంబై రాత మారుతుందో లేదో చూడాలి.

Also Read: KTR: అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా కేటీఆర్