Shreyas Iyer: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇదే సమయంలో ఇప్పుడు అయ్యర్ (Shreyas Iyer) బీసీసీఐ నుండి గొప్ప వార్తను అందుకోబోతున్నాడు. దీని కోసం అయ్యర్ గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నాడు. అయ్యర్ త్వరలో BCCI సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పొందవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
అయ్యర్‌ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చేర్చనున్నారు
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను 2024లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించింది. అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించారు. దేశవాళీ క్రికెట్‌ను విస్మరించినందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి అతన్ని తొలగించారు. ఒకవైపు ఇషాన్ కిషన్ టీమ్ ఇండియాకు దూరంగా ఉండగా, మరోవైపు శ్రేయాస్ అయ్యర్ టీమ్ ఇండియా తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.
Also Read: RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
బీసీసీఐ ఒప్పందాన్ని ఎలా తిరిగి పొందాలి?
BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి ఒక ఆటగాడిని మినహాయిస్తే. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరిగి పొందడానికి BCCI నిబంధనల ప్రకారం.. అతను 3 టెస్టులు లేదా 8 ODIలు లేదా 10 T20 మ్యాచ్‌లు ఆడాలి. అంతేకాకుండా అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడినప్పటి నుండి 10 ODI మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 3 శ్రీలంక, 3 ఇంగ్లండ్, 4 ODI మ్యాచ్‌లు ఆడాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుతమైన ప్రదర్శన
ఛాంపియన్స్ ట్రోఫీలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన అయ్యర్ ఆటతీరు అద్భుతంగా ఉంది. 4 మ్యాచ్‌లు ఆడి 195 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయ్యర్ సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 45 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్ అయ్యర్.