Site icon HashtagU Telugu

Sanju Samson: టీమిండియా స్టార్ బ్యాట‌ర్‌కి గాయం.. ఆరు వారాల‌పాటు రెస్ట్‌!

Sanju Samson

Sanju Samson

Sanju Samson: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసింది. గత మ్యాచ్‌లో అభిషేక్ శర్మ చెలరేగిన సెంచరీతో భారత జట్టు 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజ‌యంతో టీమిండియా 4-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు భారత అభిమానులకు భారీ షాక్ తగిలింది. జ‌ట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ (Sanju Samson) గాయపడి ఇప్పుడు 5-6 వారాల పాటు క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ

భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో కూడా ఆడటం సందేహంగా మారింది. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత అతను ఎన్‌సీఏకు చేరుకున్నాడు. సంజూ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం పూర్తి చేసిన వెంటనే శిక్షణను ప్రారంభించనున్నాడు. BCCI మూలం ప్రకారం.. శాంసన్ కుడి చూపుడు వేలు విరిగింది. అతను కోలుకోవడానికి దాదాపు 6 వారాలు పడుతుంది. దీంతో సంజూ జమ్మూ కాశ్మీర్‌తో రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడలేడు.

Also Read: Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ బ్యాట్ పూర్తిగా సైలెంట్‌గా ఉంది. సిరీస్‌లోని ఒక మ్యాచ్‌లో కూడా సంజూ హాఫ్ సెంచరీ చేయలేక‌పోయాడు. అతను 5 మ్యాచ్‌ల్లో 10.20 సగటుతో కేవలం 51 పరుగులు మాత్ర‌మే చేశాడు.

మరికొద్ది రోజుల్లో పాకిస్థాన్, దుబాయ్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ టోర్నీ ప్రారంభానికి ముందు గాయంతో చాలా కాలం పాటు జట్టుకు దూరం కానున్నాడు. అయితే శాంస‌న్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ట్టుకు సెలెక్ట్ కాలేదు. కానీ రిజ‌ర్వ్ ఆట‌గాళ్ల‌లో ఎంపిక‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదో టీ-20 మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బంతి శాంస‌న్ చేతికి బ‌లంగా తగిలింది. దీంతో శాంస‌న్‌కు గాయ‌మైంది. శాంసన్ అద్భుతమైన ODI రికార్డుతో అద్భుతమైన బ్యాట్స్‌మెన్. ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అయితే ఇప్పుడు అతను నెల రోజుల పాటు ఫీల్డ్‌కు దూరంగా ఉండాల్సి వ‌స్తోంది.