Ryan Ten Doeschate: గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా మారాడు. ఇప్పుడు అతని టీమ్‌లో మరింత మందిని చేర్చుకోవాలి. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఇంతలో ఓ కీలక వార్త వెలుగులోకి వచ్చింది. ఒక నివేదిక ప్రకారం.. టీమ్ ఇండియా సహాయక సిబ్బందిలో ఒక విదేశీయుడి చేరనున్నట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. గౌతమ్ గంభీర్ నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు ర్యాన్ టెన్ డోస్చేట్ (Ryan Ten Doeschate)ను సహాయక సిబ్బందిలో చేర్చుకోవాలని చూస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.
క్రిక్‌బజ్‌లోని ఒక వార్త ప్రకారం.. గంభీర్ జట్టును నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా నుండి ఫ్రీ హ్యాండ్ కోరాడు. ఈ విషయంలో మాజీ క్రికెటర్ ర్యాన్ ను జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు. ర్యాన్ ఇంతకు ముందు గౌతమ్ గంభీర్‌తో కలిసి పనిచేశాడు. అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే,.. అతను KKR టైటిల్ గెలుచుకున్న సీజన్‌లో కూడా ఉన్నాడు.
Also Read: PAN Card: చిన్నపిల్లలకు కూడా పాన్ కార్డు ఉంటుందా.. దరఖాస్తు విధానం ఇదే?
ర్యాన్ టెన్ డోస్చేట్ కెరీర్ ఇదే
ఇప్పటి వరకు ర్యాన్ టెన్ డోస్చేట్ కోచింగ్ కెరీర్‌ను పరిశీలిస్తే.. అది అద్భుతంగానే ఉంది. అయితే IPAతో పాటు అతను కరేబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, ILT20లో కూడా వివిధ పాత్రలు పోషించాడు. గంభీర్.. డోస్చేట్ పని తీరుకు పిధా అయ్యాడు. అయితే అతనిని టీమ్ ఇండియా సహాయక సిబ్బందిలో చేర్చాలనుకుంటున్నాడు హెడ్ కోచ్ గంభీర్. ర్యాన్ నెదర్లాండ్స్ తరఫున 33 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అతను 24 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో కూడా ఆడాడు.
We’re now on WhatsApp. Click to Join.
అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్..?
బీసీసీఐ కూడా అభిషేక్ నాయర్‌కు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. అతడిని టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్‌గా చేయవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. నాయర్ కూడా KKR కోసం గంభీర్‌తో కలిసి పనిచేశాడు. KKR 2024 ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసి టైటిల్‌ను గెలుచుకుంది. గంభీర్‌కి నాయర్ వర్కింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఈ కారణంగా నాయర్‌కి కూడా అవకాశం ఇవ్వవచ్చనే వార్తలు తెరమీదకి వచ్చాయి. అయితే ఇటీవల బీసీసీఐ.. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌ను నియమించిన విషయం తెలిసిందే.