Rohit- Kohli Retire: ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ ఆడిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit- Kohli Retire) వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారని భారత క్రికెట్ వీధుల్లో చర్చ జరుగుతోంది. T20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే రోహిత్, విరాట్ టీ20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ చర్చలో మాజీ క్రికెటర్ ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని భారత జట్టు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే ఇద్దరు స్టార్ ఆటగాళ్లు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ, రోహిత్‌ల వన్డే కెరీర్‌లో ఇదే చివరి మ్యాచ్ కావచ్చని భావిస్తున్నారు.
Also Read: Watermelon: పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టి తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
ఆకాశ్ చోప్రా ఏమన్నారు?
ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఇది పూర్తిగా వారి ఇష్టం. ఇది సులభం కాదు. 2025లో బ్యాట్‌తో కోహ్లీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. రోహిత్ డీసెంట్‌గా ఆడుతున్నాడు. అతని ఫామ్ చాలా బాగుందని నేను చెప్పను. ఫైనల్‌లో సెంచరీ చేయడం ద్వారా అతను గణాంకాలను మార్చగలడు. 2027లో జరిగే ODI ప్రపంచకప్‌కు ఇంకా కొన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఒక అడుగు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు.
చోప్రా ఇంకా మాట్లాడుతూ.. ఎవరైనా వారిద్దరూ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారని అడిగితే నాకు తెలియదని చెబుతాను. T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వారి రిటైర్మెంట్ ఆశ్చర్యం కలిగించలేదు. ఇది ఊహించిన విధంగానే ఉందని అన్నారు.
రెండేళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ రానుంది
ఇద్దరు ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారని, కానీ వారికి వయస్సు మీద పడుతోంది. విరాట్ కోహ్లీకి 36 ఏళ్లు, రోహిత్ శర్మకు 37 ఏళ్లు. రెండేళ్ల తర్వాత ప్రపంచకప్ రానుంది. దీని కోసం ఇద్దరు ఆటగాళ్లు తమను తాము సిద్ధం చేసుకోగలరా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వా భారత క్రికెట్‌లో ఒక శకం ముగుస్తుందా? కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా అనేది చూడాల్సి ఉంది.