Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని భారత జట్టు టైటిల్ కోసం బలమైన పోటీదారుగా పరిగణించబడుతోంది. ఛాంపియన్‌గా నిలవాలన్న కలను టీమ్‌ఇండియా సాకారం చేసుకోవాలంటే.. కెప్టెన్ హిట్ మ్యాన్ బ్యాట్‌తో తన ప్రతిభను చాటుకోవాలి. భారత జట్టు కోణంలో శుభవార్త ఏమిటంటే రోహిత్‌కి దుబాయ్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. దుబాయ్‌లో హిట్‌మ్యాన్ బౌలర్లను ఆడుకుంటాడు. ఇక్కడ రోహిత్ సగటు 105గా ఉంది.
రోహిత్‌కి దుబాయ్ మైదానం అంటే ఇష్టం
దుబాయ్‌లో రోహిత్ శర్మ రికార్డు అద్భుతంగా ఉంది. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి 105.66 అద్భుతమైన సగటుతో 317 పరుగులు వచ్చాయి. ఈ సమయంలో రోహిత్ స్ట్రైక్ రేట్ 93.5గా ఉంది. దుబాయ్‌లో భారత కెప్టెన్ 2 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. విశేషమేమిటంటే రోహిత్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో రెండింట్లో నాటౌట్‌గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో మాత్రమే ఆడాలి. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ సాధించిన ఈ రికార్డు టీమ్ మేనేజ్‌మెంట్‌కు కూడా రిలీఫ్ న్యూస్.
Also Read: YSRCP: తునిలో వైసీపీకి భారీ షాక్? ఒకేసారి 10 మంది జంప్?
హిట్‌మ్యాన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు
రోహిత్ శర్మ తన బ్యాడ్ ఫామ్ నుంచి బయటపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో హిట్‌మ్యాన్ బ్యాట్‌తో బీభత్సం సృష్టించాడు. కటక్ మైదానంలో ఇంగ్లిష్ బౌలర్లను చిత్తు చిత్తుగా ఆడుకున్న రోహిత్ 90 బంతుల్లో 119 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ సమయంలో హిట్‌మ్యాన్ తన పాత ఫామ్‌లో కనిపించాడు. అతని బ్యాట్ నుండి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. రోహిత్ 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. రోహిత్ కెరీర్‌లో అత్యధిక పరుగులు వన్డే ఫార్మాట్‌లోనే వచ్చాయి. 2023లో భారత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ తన పేలుడు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.