Site icon HashtagU Telugu

RCB: ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందా..? సన్‌రైజర్స్ మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు

Rcb640 6

Rcb640 6

RCB: ప్రస్తుతం ఐపీఎల్‌లో ప్లేఆప్స్ రేసు రసవత్తరంగా జరుగుతోంది. ఏ జట్టు ప్లేఆప్స్‌కు వెళుతుందనేది ఉత్కంఠకరంగా మారింది. జట్లన్నీ బలంగా పోటీ పడుతున్నాయి. దీంతో ఐపీఎల్ మ్యాచులు రంజుగా మారాయి. అయితే ఆర్సీబీ ప్లేఆప్స్ రేసులోకి వెళుతుందా.. లేదా అనేది ఆ జట్టు అభిమానుల్లో టెన్షన్ రేపుతోంది. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టుపై సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలవటానికి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన శక్తివంతులా కృషి చేస్తాడని టామ్ మూడీ పేర్కొన్నాడు. ఆర్సీబీ సీజన్ ప్రథమార్థంలో బాగానే ఆడినప్పటికీ రెండో సీజన్ లో ఆశించిన ప్రదర్శన కనబర్బలేదని అభిప్రాయపడ్డాడు. కానీ ప్లే ఆఫ్స్ రేసులో నిలవడానికి కోహ్లీ శాయశక్తులా కృషి చేస్తాడని అన్నాడు. ఆర్సీబీ మిగిలిన మ్యాచ్‌లలో వంద శాతం గెలవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని టామ్ మూడీ తెలిపాడు. వారికి విరాట్ కోహ్లీ వంటి మంచి ఆటగాడు ఉన్నాడని చెప్పాడు.

ఇక టీమిండియా మాజీ క్రికెటర్ యసూఫ్ పఠాన్ కూడా ఆర్సీబీ జట్టు గురించి మాట్లాడాడు. విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, డూప్లెసిస్ వంటి ఆటగాళ్లపై మాత్రమే ఆర్సీబీ ఆధారపడుతుందని, కేవలం ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే ఆధారపడుతుదన్నాడు. ఆర్సీబీ జట్టు అందరూ కలిసి ఆడాలని, కేవలం ముగ్గురిపై ఆధారపడటం సరికాదన్నాడు. ప్రతి ఆటగాడు ముందుకు వచ్చి బాధ్యతలను తీసుకుంటే జట్టు విజయం సాధిస్తుందని చెప్పాడు.

కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. 6 మ్యాచ్ లలో గెలవగా.. 6 ఓిపోయింది. ప్లే ఆప్స్ కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లలో తప్పనిసరిగా గెలవాలి. ఇవాళ సర్‌రైజర్స్ తో బెంగళూరు తలపడనుంది.