ఐపీఎల్ 2026.. చివ‌రి సీజ‌న్ ఆడ‌నున్న ఆట‌గాళ్లు వీరేనా?!

కోల్‌కతా నైట్ రైడర్స్ వెన్నెముకగా నిలిచిన ఈ మిస్టరీ స్పిన్నర్ కూడా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Published By: HashtagU Telugu Desk
IPL 2026

IPL 2026

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి సందడి చేయడానికి సిద్ధమైంది. ఐపీఎల్ 2026 మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు మరోసారి తమ సత్తా చాటనున్నారు. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ టోర్నమెంట్‌లో ఉత్కంఠభరితమైన పోరాటాలు చూడవచ్చు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ అభిమానులకు చాలా ప్రత్యేకమైనది. భావోద్వేగంతో కూడుకున్నది కానుంది. ఎందుకంటే కొందరు దిగ్గజ ఆటగాళ్లు ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో చివరిసారిగా కనిపించబోయే ఆ ఏడుగురు సూపర్ స్టార్ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

ఈ జాబితాలో మొదటి పేరు చెన్నై సూపర్ కింగ్స్ ‘థాలా’ MS ధోనీది. 44 ఏళ్ల ధోనీ 2026 సీజన్ తర్వాత ఐపీఎల్ నుండి రిటైర్ అయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ధోనీ ఈ సీజన్‌లో కేవలం 3 లేదా 4 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు 5 సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ పేరు వినిపిస్తోంది. 38 ఏళ్ల రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఇప్పుడు IPL 2026లో MI తరపున ఆడుతూ తన అద్భుతమైన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలకవచ్చు.

అదేవిధంగా 37 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు కూడా ఇది చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చు. వీరితో పాటు అజింక్యా రహానే, మిచెల్ స్టార్క్, డేవిడ్ మిల్లర్, సునీల్ నరైన్ వంటి ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. 37 ఏళ్ల వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు కూడా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీరితో పాటు మరికొందరు అంతర్జాతీయ స్టార్లు కూడా రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Also Read: ఐపీఎల్ 2026.. 9 వేల పరుగుల ముంగిట విరాట్‌ కోహ్లీ!!

అజింక్య రహానే: తన క్లాసిక్ బ్యాటింగ్‌తో ఎన్నో ఏళ్లుగా రాణిస్తున్న రహానేకు ఇది ఆఖరి సీజన్ కావచ్చు.

మిచెల్ స్టార్క్: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ స్టార్క్ కూడా గాయాలు, పనిభారం దృష్ట్యా ఐపీఎల్‌కు స్వస్తి పలకవచ్చు.

డేవిడ్ మిల్లర్: ‘కిల్లర్ మిల్లర్’గా పేరుగాంచిన ఈ దక్షిణాఫ్రికా వీరుడు కూడా లీగ్ నుండి తప్పుకోవచ్చు.

సునీల్ నరైన్: కోల్‌కతా నైట్ రైడర్స్ వెన్నెముకగా నిలిచిన ఈ మిస్టరీ స్పిన్నర్ కూడా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

  Last Updated: 18 Mar 2026, 10:29 PM IST