Rishabh Pant: డిసెంబర్ 30, 2022న భారత క్రికెట్‌కు ఓ భారీ షాక్ తగిలింది. టీమ్ ఇండియా జెర్సీలో దేశవిదేశాల్లో హీరోగా నిరూపించుకున్న రిషభ్ పంత్ (Rishabh Pant) ఆ రోజు భయంకరమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కీకి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కారు బోల్తా పడింది. అతని శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా దెబ్బతిన్న కారు, పంత్ పరిస్థితిని చూసి అందరూ భయపడి ఆందోళనకు గురయ్యారు. కేవలం క్రికెట్ అభిమానుల మనసులోనే కాకుండా పంత్ హృదయంలో కూడా మొదటి ప్రశ్న ఏమి వచ్చిందో తాజాగా బయటకు వచ్చింది. “నేను మళ్లీ మైదానంలోకి తిరిగి రాగలనా?” ఈ విషయాన్ని పంత్‌కు శస్త్రచికిత్స చేసిన ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ దినేష్ పర్దీవాలా వెల్లడించారు.
పంత్ మొదటి ప్రశ్న
భయంకరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్వాత రిషభ్ పంత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని మొదటి ప్రశ్న ఏమిటంటే “నేను మళ్లీ ఆడగలనా?” ఈ ప్రశ్నను అతను ఆర్థోపెడిక్ సర్జన్ దినేష్ పర్దీవాలాను అడిగాడు. దినేష్ టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. పంత్‌ను ఆ ప్రమాదం నుంచి అక్కడి నుంచి వెళ్తున్న వారు బయటకు తీసుకొచ్చారు. పంత్ చాలా అదృష్టవంతుడు. అతను బయటపడ్డాడు. పంత్ మొదటిసారి వచ్చినప్పుడు అతని కుడి మోకాలు స్థానభ్రంశం చెందింది. అంతేకాకుండా అతని కుడి చీలమండలో కూడా గాయం అయింది. దీనితో పాటు ఇతర అనేక గాయాలు కూడా అయ్యాయి. అతని చర్మం తీవ్రంగా కాలిపోయింది. కారు గాజు నుంచి బయటకు వచ్చే సమయంలో అతని చర్మం, వీపు మీద తీవ్ర గాయాలయ్యాయి అని పేర్కొన్నాడు.
Also Read: Fruits : ఖాళీ కడుపుతో ఈ పండ్లు అస్సలు తినకండి.. నిర్లక్ష్యం చేస్తే మీ ఆరోగ్యానికి డేంజర్!
డాక్టర్ మరింత చెప్పారు. ఇలాంటి ప్రమాదంలో కారు బోల్తా పడినప్పుడు, మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మోకాలు స్థానభ్రంశం అయినప్పుడు లిగమెంట్ విరిగిపోతే రక్తనాళాలు కూడా గాయపడే అవకాశాలు చాలా ఎక్కువ. ఒకవేళ రక్తనాళాలు గాయపడితే రక్త సరఫరాను పునరుద్ధరించడానికి 4 నుంచి 6 గంటల సమయం ఉంటుంది. అదృష్టవశాత్తూ పంత్ మోకాలు స్థానభ్రంశం అయినప్పటికీ అతని రక్తనాళాలు గాయపడలేదు. ఆసుపత్రిలో చేర్చినప్పుడు పంత్ మొదటి ప్రశ్న ఏమిటంటే ‘నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా?’ అయితే, పంత్ తల్లి అడిగిన ప్రశ్న ఏమిటంటే ‘అతను మళ్లీ నడవగలడా?’ అని అడిగినట్లు డాక్టర్ చెప్పారు. ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి పంత్‌కు 635 రోజులు పట్టాయి.