Site icon HashtagU Telugu

Delhi Capitals : డూ ఆర్ డై పోరులో ఢిల్లీ నిలిచేనా ?

Delhi Capitals

Delhi Capitals

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో పయనిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 7 గెలిచి 14 పాయింట్లతో పట్టికలో సంజూ శాంసన్‌ బృందం మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. 11 మ్యాచ్‌లలో 5 గెలిచి 10 పాయింట్లతో ఐదో స్థానంలో రిషబ్ పంత్ సేన ఉంది.

దీంతో ఇరు ఈ మ్యాచ్ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఇరు జట్ల ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ కాస్త మెరుగ్గా కనిపిస్తుంది.అలాగే బలాబలాల విషయానికొస్తే..రాజస్థాన్ రాయల్స్ జట్టులో జోస్‌ బట్లర్, యశస్వి జైశ్వాల్ ఫామ్‌ సానుకూల అంశం. బౌలింగ్‌ విభాగంలో యజువేంద్ర చహల్‌, అశ్విన్‌, యువ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌ రాణించడం వారికి బలం అని చెప్పొచ్చు.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ విషయానికి వస్తే.. తచ చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఓటమి పాలైంది. డేవిడ్‌ వార్నర్‌, పృథ్వీ షా,మిచెల్‌ మార్ష్‌, పంత్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లతో ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌ పరంగా కూడా ఢిల్లీ అద్భుతంగా రాణిస్తోంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్‌లో ఢిల్లీ కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అలాగే ఇరు జట్లు ఇప్పటి వరకు ముఖాముఖి 25 సార్లు తలపడగా.. ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

Exit mobile version