AB De Villiers: రీ ఎంట్రీపై ఏబీడీ సంచలన వ్యాఖ్యలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టులోకి దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు . అంతర్జాతీయ క్రికెట్‌కి 2018లో వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసాక ఈ క్యాష్ రీచ్ లీగ్ కు కూడా గుడ్ బై చెప్పేసాడు.

  • Written By:
  • Updated On - May 24, 2022 / 04:01 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టులోకి దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు . అంతర్జాతీయ క్రికెట్‌కి 2018లో వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసాక ఈ క్యాష్ రీచ్ లీగ్ కు కూడా గుడ్ బై చెప్పేసాడు. అయితే ఐపీఎల్ 2023 సీజన్ లో ఆర్సీబీలోకి తానూ రీ ఎంట్రీ ఇస్తానని ఎబి డివిలియర్స్ పేర్కొన్నాడు. దాంతో.. ఏబీ డివిలియర్స్ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడా లేక మెంటార్ గా ఎంట్రీ ఇస్తాడా అన్నది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఓ కార్యక్రమంలో డివిలియర్స్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌ సీజన్‌ 2023 సీజన్ లో ఆర్సీబీ తరఫున తనని మళ్ళీ చూస్తారని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్‌లోకి పునరాగమనం చేయాలి అనుకుంటున్నాను. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది బెంగళూరు నాకు రెండో ఇల్లు లాంటిది. ఆర్సీబీ అభిమానుల కేరింతల మధ్య చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు ఆడటం నాకు చాలా ఇష్టం.. రాబోయే సీజన్ లో బెంగళూరు తరఫున మీరు నన్ను మళ్ళీ చూడబోతున్నారు అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

ఇక డివిలియర్స్ ఆర్సీబీ తరఫున పునరాగమనం చేయనున్నాడనే వార్త తెలిసి ఆర్సీబీ అభిమానులు ఫుల్ ఖుషికి అవుతున్నారు. 2011లో ఆర్సీబీలోకి అడుగుపెట్టిన ఏబీ డివిలియర్స్.. ఆ జట్టుతరఫున 156 మ్యాచ్‌లాడి ఏకంగా 4491 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 37 ఆఫ్ సెంచరీల సాయంతో 4491 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో మొత్తంగా 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ తో తలపడనుంది.