Site icon HashtagU Telugu

Chetan Sharma: చేతన్‌ శర్మపై వేటు తప్పదా..? ఎవరీ చేతన్‌ శర్మ..?

Chetan Sharma

Resizeimagesize (1280 X 720) (3) 11zon

BCCI చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma)పై జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలతో అతడిపై వేటు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది అతడి సెలక్షన్‌ నిర్ణయాలతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా ఆయనకే మరోసారి బాధ్యతలు ఇచ్చారు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా వైఫల్యం కారణంగా సెలక్షన్ కమిటీ సభ్యులందరినీ తప్పించి, ఛైర్మన్‌ చేతన్‌ను మాత్రం బీసీసీఐ కొనసాగించింది. టీమ్ఇండియా క్రికెటర్లు ఫిట్‌నెస్ కోసం ఇంజక్షన్లు తీసుకుంటారంటూ వ్యాఖ్యానించి ఒక్కసారిగా హైలైట్ అయ్యారు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్‌శర్మ.

1966, జనవరి 3న జన్మించిన చేతన్‌శర్మ 1983లో తన 17వ ఏట పంజాబ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 1984లో ఇండియా తరఫున తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి.. ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 23టెస్టులు, 65 వన్డేలు ఆడిన ఆయన 1996లో క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.

Also Read: ICC Website Results: ఆస్ట్రేలియానే నంబర్ 1.. ఐసీసీ తప్పిదంపై ఫాన్స్ ఫైర్..!

కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై సంచలన వ్యాఖ్యలు

విరాట్‌ను వ‌న్డే కెప్టెన్సీ నుంచి తొల‌గించిన విష‌యంపై టీమిండియా చీఫ్‌ సెలెక్ట‌ర్ చేత‌న్‌శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. రోహిత్‌ను కెప్టెన్‌గా చేయాల‌ని బీసీసీఐకి ఆలోచ‌న లేద‌ని.. కానీ విరాట్‌ను ఆ ప‌గ్గాల నుంచి త‌ప్పించాల‌న్న ఆలోచ‌న ఉంద‌ని చెప్పాడు. విరాట్ త‌న‌కు తాను గొప్ప‌గా భావించేవాడ‌ని, ఆట క‌న్నా తానే ఎక్కువ అనుకునే వాడని, అప్పట్లో విరాట్ ప్ర‌వ‌ర్త‌నపై బోర్డులో స‌రైన అభిప్రాయం లేద‌ని చేత‌న్ చెప్పుకొచ్చాడు.