Site icon HashtagU Telugu

IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైన‌ల్‌.. కోల్‌క‌తా నుంచి అహ్మదాబాద్‌కు మార్చ‌టానికి కార‌ణ‌మిదే!

IPL 2025 Final

IPL 2025 Final

IPL 2025 Final: ఈ ఐపీఎల్ సీజన్ ఫైనల్ (IPL 2025 Final) మ్యాచ్ మొదట కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగాల్సి ఉంది. తొలుత‌ టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైనప్పుడు, అందరూ ఫైనల్ అక్కడే జరుగుతుందని భావించారు. కానీ మధ్యలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఐపీఎల్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోగానే.. బీసీసీఐ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ప్లాన్‌లో ప్లేఆఫ్ మ్యాచ్‌ల స్థలాలను కూడా పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుందని తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.

కోల్‌కతా అభిమానులకు నిరాశ

కోల్‌కతా క్రికెట్ ప్రేమికులకు ఈ వార్త చాలా నిరాశకరంగా మారింది. మొదట వారి జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ గ్రూప్ స్టేజ్‌లోనే బయటకు వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత‌ ఫైనల్ మ్యాచ్ కూడా వారి నగరం నుండి మార్చ‌డంతో బీసీసీఐపై కోల్‌కతాలోని క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ నిర్ణయంపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ మార్పుకు బీసీసీఐ తాజాగా స‌రైన‌ కారణాన్ని తెలిపింది.

Also Read: Virat Kohli: నాకు మాట‌లు రావ‌డం లేదు.. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విరాట్ కోహ్లీ విచారం!

వాస్తవానికి జూన్ 3 రాత్రి కోల్‌కతాలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం రాత్రి 9 గంటల నుండి దాదాపు తెల్లవారుజాము 1 గంట వరకు కొనసాగింది. ఆ రోజు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ సూచన కూడా తెలిపింది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలో జరిగి ఉంటే వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి కావడం కష్టమయ్యేది. అదేరోజు (జూన్ 3) అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం కేవలం 3 శాతం మాత్రమే ఉంది. అక్కడ వర్షం పడలేదు. అందుకే మ్యాచ్ సరైన సమయంలో పూర్తిగా నిర్వ‌హించ‌గ‌లిగారు.

బీసీసీఐ ఏమి చెప్పింది?

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ఈ నిర్ణయంలో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు. మ్యాచ్‌ను కోల్‌కతా నుండి అహ్మదాబాద్‌కు మార్చడం పూర్తిగా వాతావరణ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయమని వివరించారు. ఫైనల్ అహ్మదాబాద్‌లో జరుగుతున్నప్పుడు కోల్‌కతాలో భారీ వర్షం కురుస్తోంది. అందుకే ఈ నిర్ణయం టోర్నమెంట్ విజయవంతమైన నిర్వహణ, మ్యాచ్ సకాలంలో పూర్తి కావడం కోసం అవసరమని తెలిపారు.