Shreyas Iyer: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు. సెలెక్టర్లు మరోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ శ్రేయస్ అయ్యర్‌కు జట్టులో చోటు కల్పించలేదు. శుభ్‌మన్ గిల్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. కానీ అయ్యర్ మాత్రం సెలెక్టర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో విఫలమయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో పాటు, ఐపీఎల్ 2025లో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ అయ్యర్‌ను (Shreyas Iyer) మరోసారి విస్మరించారు. జట్టులో అయ్యర్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయ్యర్‌ను మళ్లీ పక్కనపెట్టారు
దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు సాధించినప్పటికీ శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్ 2025 జట్టు నుంచి పక్కన పెట్టారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ అయ్యర్. దీంతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో కూడా అయ్యర్ బ్యాట్ బాగా మెరిసింది. అతను 9 మ్యాచ్‌లలో 188 స్ట్రైక్ రేట్‌తో 345 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2025లో కూడా తన బ్యాటింగ్, కెప్టెన్సీతో అయ్యర్ అందరినీ ఆకట్టుకున్నాడు. అతను 17 మ్యాచ్‌లలో 175 స్ట్రైక్ రేట్‌తో 604 పరుగులు చేశాడు.
Also Read: India Asia Cup 2025 Squad: ఆసియా కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
అభిమానుల ఆగ్రహం
నిరంతరంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ పేరు ఆసియా కప్ 2025 జట్టులో లేదు. అయ్యర్‌ను పక్కనపెట్టడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు సెలెక్టర్లను తీవ్రంగా విమర్శించారు. కొందరు అభిమానులు అయ్యర్ కోసం ఎమోషనల్ మెసేజ్‌లు కూడా రాశారు. అయితే టీ20 ఫార్మాట్‌లో గత ప్రదర్శనల ఆధారంగానే జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఆసియా కప్ కోసం భారత జట్టు
- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.