విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

అంతర్జాతీయ క్యాలెండర్‌తో పాటే దేశవాళీ క్యాలెండర్ కూడా విడుదలవుతుంది. ఏ మైదానాల్లో మ్యాచ్‌లను షూట్ చేయడం సులభం, వేటిని టెలికాస్ట్ చేయాలి అనేది బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్స్ చాలా ముందుగానే నిర్ణయించుకుంటారు.

Published By: HashtagU Telugu Desk
Vijay Hazare Trophy

Vijay Hazare Trophy

Vijay Hazare Trophy: డిసెంబర్ 24 నుంచి దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఘనంగా ప్రారంభమైంది. మొదటి రౌండ్‌లో రోహిత్ శర్మ (ముంబై), విరాట్ కోహ్లీ (ఢిల్లీ) తమ రాష్ట్రాల తరఫున బరిలోకి దిగడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే వీరిద్దరూ ఆడిన మ్యాచ్‌లు టీవీలో ప్రత్యక్ష ప్రసారం కాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

ఆర్. అశ్విన్ చెప్పిన కారణం ఏమిటి?

రోహిత్, విరాట్ మ్యాచ్‌లను ఎందుకు టెలికాస్ట్ చేయలేదో టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ ఆర్. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వివరించారు. అశ్విన్ మాట్లాడుతూ.. అందరూ రోహిత్, విరాట్‌లను చూడాలనుకుంటారనేది నిజం. కానీ వారు ఈ టోర్నీలో ఆడుతున్నారనే సమాచారం ప్రసారదారులకు ఎంత ముందుగా తెలిసింది అనేది ముఖ్యం అని అశ్విన్ పేర్కొన్నారు.

Also Read: బంగ్లాదేశ్ ఎన్నికలు.. షేక్ హసీనా పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ!

అంతర్జాతీయ క్యాలెండర్‌తో పాటే దేశవాళీ క్యాలెండర్ కూడా విడుదలవుతుంది. ఏ మైదానాల్లో మ్యాచ్‌లను షూట్ చేయడం సులభం, వేటిని టెలికాస్ట్ చేయాలి అనేది బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్స్ చాలా ముందుగానే నిర్ణయించుకుంటారు. రోహిత్, విరాట్ ఈ టోర్నీ ఆరంభం నుంచే ఆడతారని ముందుగా అనుకోలేదు. చివరి నిమిషంలో వారు జట్టులోకి రావడంతో అప్పటికప్పుడు ప్రసార ఏర్పాట్లు మార్చడం సాంకేతికంగా కష్టమని అశ్విన్ వివరించారు. రోహిత్ శర్మ ధాటిగా ఆడి ముంబైకి భారీ విజయాన్ని అందించగా, విరాట్ కోహ్లీ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ గెలుపును ఖాయం చేశారు.

  Last Updated: 25 Dec 2025, 04:44 PM IST