Rishabh Pant Banned: ఢిల్లీకి బిగ్ షాక్‌.. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం..?

రిష‌బ్ పంత్‌.. కారు ప్ర‌మాదం నుంచి కోలుకున్న త‌ర్వాత ఐపీఎల్ 2024లో ఆడుతున్నాడు. అంతేకాకుండా ఢిల్లీ జ‌ట్టుకు కెప్టెన్సీ కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

  • Written By:
  • Updated On - April 28, 2024 / 10:21 AM IST

Rishabh Pant Banned: రిష‌బ్ పంత్‌.. కారు ప్ర‌మాదం నుంచి కోలుకున్న త‌ర్వాత ఐపీఎల్ 2024లో ఆడుతున్నాడు. అంతేకాకుండా ఢిల్లీ జ‌ట్టుకు కెప్టెన్సీ కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇటీవ‌ల కాలంలో పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజ‌యం సాధించి 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే ఢిల్లీ గ‌త ఐదు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ మాత్ర‌మే ఓడిపోయి నాలుగింటిలో విజ‌యం సాధించింది. శ‌నివారం ముంబైతో జ‌రిగిన ఉత్కంఠ పోరులో 10 పరుగుల తేడాతో పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన ఢిల్లీ జ‌ట్టుకు ఓ బిగ్ షాక్ త‌గిలేలా ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ త‌దుప‌రి ఆడే మ్యాచ్‌లో పంత్‌పై నిషేధం ఉండే అవ‌కాశం ఉంది. ఆ నిషేధం ఎందుకు..? అస‌లు పంత్ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..!

పంత్‌పై ఒక మ్యాచ్ బ్యాన్..?

రేపు KKRతో ఆడే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ జట్టు కెప్టెన్ పంత్ (Rishabh Pant Banned) ఇప్పటికే రెండుసార్లు జరిమానా చెల్లించారు. శ‌నివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి అదే తప్పు రిపీట్ అయింది. ఈ నేపథ్యంలో పంత్‌కు రూ.30 లక్షల వరకు జరిమానాతో పాటు తర్వాతి మ్యాచ్‌కు వేటు పడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రేపు కేకేఆర్‌తో జ‌రిగే మ్యాచ్‌కు పంత్ లేకుండానే ఢిల్లీ జ‌ట్టు బ‌రిలోకి దిగాల్సి ఉంటుంది.

Also Read: e-Shram Card: ఈ కార్డు ఉంటే బోలెడు ప్ర‌యోజ‌నాలు.. నెల‌కు రూ.3000 పెన్ష‌న్ కూడా..!

ఇక ఐపీఎల్ 2024లో ముంబై వ‌ర్సెస్ ఢిల్లీ మ్యాచ్ విష‌యానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. DC IPL చరిత్రలో మొదటిసారి 250 కంటే ఎక్కువ పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ జట్టు కోసం తుఫాను ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టు భారీ స్కోరు సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

We’re now on WhatsApp : Click to Join