RCB Green Jersey: అయిదేళ్ల తర్వాత గ్రీన్ జెర్సీలో ఎట్టకేలకు విజయం

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రీన్ జెర్సీ గురించి అభిమానులకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 08:37 PM IST

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రీన్ జెర్సీ గురించి అభిమానులకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పచ్చదనం పరిరక్షణ కోసం ప్రతీ సీజన్ లో ఒక మ్యాచ్ లో బెంగుళూరు ఈ గ్రీన్ జెర్సీ ధరించి బరిలోకి దిగుతుంది. ఈ సారి కూడా పచ్చ జెర్సీ తో ఆడింది. నిజానికి ఈ రంగు జెర్సీని ధరించడం ఆర్సీబీకి కొత్తేమీ కాదు. 2011 సీజన్ నుంచీ దీన్ని పాటిస్తూ వస్తోంది. ఇప్పుడూ దాన్ని కొనసాగిస్తోంది.అయితే ఆర్సీబీకి ఈ గ్రీన్ క‌ల‌ర్‌ జెర్సీ పెద్దగా కలిసి రాలేదు.గ్రీన్ కలర్ జెర్సీని ధరించి ఆడిన తొలి మ్యాచ్‌లల్లో ఏడింట్లో ఓటమిపాలైంది.

2011లో గ్రీన్ జెర్సీని ధరించి ఆడిన తొలి మ్యాచ్‌లో గెలిచింది. ఆ తరువాత 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020లల్లో ఓడిపోయింది. 2015లో ఈ కలర్ జెర్సీలో ఆడిన మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 2016 సీజన్ మ్యాచ్‌ను గెలిచిన సన్ రైజర్స్ మళ్ళీ అయిదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఈ జెర్సీ లో విజయాన్ని అందుకోగలిగింది.గతేడాది కరోనా వారియ‌ర్స్‌కు మ‌ద్ద‌తుగా బ్లూ క‌ల‌ర్ జెర్సీ ధరించిన ఆర్సీబియ‌న్లు.. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, చెట్ల పెంపకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘గో గ్రీన్’ నినాదంతో గ్రీన్ క‌ల‌ర్ జెర్సీల‌ను ధ‌రించారు. సమిష్టిగా రాణించిన బెంగుళూరు తమకు అంతగా అచ్చి రాని గ్రీన్ జెర్సీలోనే ఘన విజయాన్ని అందుకుని ఫాన్స్ ను ఖుషీ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆర్సీబీ గ్రీన్ జెర్సీ పై ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సెంటిమెంట్ బ్రేక్ చేశారంటూ ట్వీట్లు చేస్తున్నారు.