MS Dhoni: ధోనీకి ఇదే చివ‌రి సీజ‌నా..? అందుకే కెప్టెన్సీ వ‌దిలేశాడా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు గురువారం చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద ప్రకటన చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని యువ ఆట‌గాడు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించింది.

  • Written By:
  • Updated On - March 21, 2024 / 05:55 PM IST

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు గురువారం చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద ప్రకటన చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని యువ ఆట‌గాడు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించింది. అంటే 17వ సీజన్‌లో ధోనీ ఆటగాడిగా మైదానంలో కనిపించనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీకి ఇదే చివరి సీజన్‌ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఫ్రాంచైజీ ఒక ప్రకటన విడుదల చేసింది

చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ప్రకటనలో.. “టాటా IPL 2024 ప్రారంభానికి ముందు MS ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాం. రుతురాజ్ 2019 నుండి చెన్నై సూపర్ కింగ్స్‌లో అంతర్భాగంగా ఉన్నాడు. ఈ కాలంలో ఐపిఎల్‌లో 52 మ్యాచ్‌లు ఆడాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ధోనీ స్వయంగా నిర్ణయించుకున్నాడని, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదని ఫ్రాంచైజీ ప్రకటన ద్వారా స్పష్టమైంది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోనీ త్వరలో ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పే అవకాశం ఉందనే ఊహాగానాలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.

Also Read: Decoding Dhoni: కెప్టెన్లకే కెప్టెన్ లాంటోడు.. సారథిగా ధోనీ రికార్డులు ఇవే

మహేంద్ర సింగ్ ధోనీ వయసు 42 ఏళ్లు. బ్యాటింగ్‌లో తనని తాను నిరంతరం మెరుగుప‌ర్చుకుంటూనే ఉన్నాడు. గత సీజన్‌లో చాలాసార్లు వికెట్ల మధ్య పరిగెత్తిన తర్వాత చాలా అలసిపోయినట్లు కనిపించాడు. గత సీజన్‌లో విజయం సాధించిన తర్వాత ధోనీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీని తర్వాత ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఒకవేళ ధోనీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు కాబ‌ట్టి ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడక తప్పదని అభిమానులు భావిస్తున్నారు.

చెన్నై 5 సార్లు టైటిల్ గెలుచుకుంది

మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో CSK 5 సార్లు IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఫ్రాంచైజీ 2010, 2011, 2018, 2021, 2023 సంవత్సరాల్లో మహి ఆధ్వర్యంలో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఐపీఎల్‌లో కెప్టెన్ కూల్ ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే.. అతను 250 మ్యాచ్‌లలో 217 ఇన్నింగ్స్‌లలో 5082 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 24 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. ఐపీఎల్‌లో అతని అత్యధిక స్కోరు 84 పరుగులు.

We’re now on WhatsApp : Click to Join