Site icon HashtagU Telugu

MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ వ‌దిలేయ‌డానికి కార‌ణాలివేనా..?

MS Dhoni

No Retirement! Ms Dhoni Confirms His Return Date After Successful Knee Surgery

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్‌కు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది అనుభవజ్ఞులు ధోనీ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదని, మరోవైపు చాలా మంది అనుభవజ్ఞులు తప్పు అని అంటున్నారు. ధోనీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ అతను ఇప్పటికే RCBతో మ్యాచ్ కూడా ఆడాడు. అస‌లు ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ నుంచి ఎందుకు త‌ప్పుకున్నాడో ఈ క‌థ‌నంలో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

2023 ఐపీఎల్ సీజ‌న్‌లో ధోనీ కెప్టెన్సీని మ‌ధ్య‌లోనే వ‌దిలేసి త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు ర‌వీంద్ర జ‌డేజాకు అప్ప‌గించాడు. అయితే జ‌డేజా కెప్టెన్సీలో విఫ‌లం కావ‌డంతో మ‌ళ్లీ ధోనీనే నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్నాడు. అయితే ప్ర‌స్తుతానికి ధోనీ వ‌య‌సు 42 ఏళ్లు. ఈ వ‌య‌సులో ఫిట్‌గా ఉండాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. గ‌తేడాది సీజ‌న్‌లో ధోనీ మోకాలి గాయంతోనే ఫైన‌ల్ మ్యాచ్ ఆడి జ‌ట్టుకు ట్రోఫీ అందించాడు. ఆ త‌ర్వాత శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. అయితే ధోనీకి ఇదే ఐపీఎల్ సీజ‌న్ కావొచ్చ‌ని క్రీడా పండితులు అంటున్నారు. అందుకోస‌మే ధోనీ త‌న భ‌విష్య‌త్తు దృష్ట్య్యా ముందుచూపుతోనే కెప్టెన్సీని గైక్వాడ్‌కి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Also Read: Gift Of Thar : సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి గిఫ్టుగా థార్.. ఆనంద్ మహీంద్రా గ్రేట్ !

ధోనీ నిర్ణయం కంటతడి పెట్టించింది: CSK కోచ్

ఎంఎస్ ధోనీ తన పదవిని రుతురాజ్‌ గైక్వాడ్‌‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గురించి CSK ప్రధాన కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ.. ‘ధోనీ తన నిర్ణయం వెల్లడించినప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌ భావోద్వేగాలతో నిండిపోయింది. అప్పుడందరూ కంటతడి పెట్టారు. రెండేళ్ల కిందట కెప్టెన్సీ మార్పు చేశాం. అప్పుడు మేం సిద్ధంగా లేకపోవడంతో మళ్లీ ధోనీనే బాధ్యతలు చేపట్టాడు’ అని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp : Click to Join

సెహ్వాగ్ ఛ‌లోక్తులు

శుక్ర‌వారం జరిగిన చెన్నై-బెంగళూరు మ్యాచ్‌లో కెమెరామెన్ పదే పదే ధోనీనే ఫోకస్ చేయడంపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించాడు. హర్యానా కామెంట్రీ బాక్స్‌లో ఉన్న వీరూ ఈ విషయంపై ఛలోక్తులు విసిరాడు. ‘‘భయ్యా.. దయచేసి రుతురాజ్‌ ముఖాన్ని కూడా కాస్త చూపించండి. అతడు ఇప్పుడు కెప్టెన్‌. ఏంటో.. ఈ కెమెరామెన్‌ ఎ‍ప్పుడూ ధోని ఫేస్‌ మాత్రమే చూపిస్తున్నాడు’’ అని కామెంట్‌ చేశాడు.