Fake T20 World Cup Trophy: టీమిండియా వద్ద ఉన్నది టీ20 వ‌రల్డ్ క‌ప్‌ ఒరిజినల్ ట్రోఫీ కాదు..! అస‌లు విష‌యమిదే..!

టీమ్ ఇండియా భారత్‌కు తెచ్చిన ట్రోఫీ (Fake T20 World Cup Trophy) నిజ‌మైన‌ది కాద‌ని మీకు తెలుసా?

  • Written By:
  • Updated On - July 4, 2024 / 07:35 PM IST

Fake T20 World Cup Trophy: అమెరికా, వెస్టిండీస్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన టీమ్ ఇండియా ప్రపంచకప్ ట్రోఫీతో స్వ‌దేశానికి చేరుకుంది. కొన్ని రోజులుగా బార్బడోస్‌లో చిక్కుకుపోయిన రోహిత్ శర్మ అండ్ జ‌ట్టు ప్రత్యేక చార్టర్డ్ విమానంలో గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా టీ20 ప్రపంచకప్ చూసిన భారత అభిమానుల ఆనందానికి అవధులు లేవు. కానీ టీమ్ ఇండియా భారత్‌కు తెచ్చిన ట్రోఫీ (Fake T20 World Cup Trophy) నిజ‌మైన‌ది కాద‌ని మీకు తెలుసా?

టీమ్ ఇండియా ఫేక్ ట్రోఫీని ఎందుకు తీసుకొచ్చింది?

17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఎంఎస్ ధోని తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఈ చరిత్ర సృష్టించింది భార‌త్ జ‌ట్టు. జూన్ 29న బార్బడోస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది. దీని తర్వాత రోహిత్ శర్మ.. టీమ్ ఇండియా ఇతర ఆటగాళ్లు ఫోటోషూట్ చేసిన ట్రోఫీ నిజమే. కానీ భారతదేశానికి వ‌చ్చేముందు వారికి డూప్లికేట్‌ ట్రోఫీని అందించారని ప‌లు క‌థ‌నాలు పేర్కొన్నాయి.

Also Read: Rohit & Bumrah: మరో మెడల్ రేసులో రోహిత్, బూమ్రా..!

టీమ్ ఇండియా భారత్ తీసుకొచ్చిన ట్రోఫీ నిజ‌మైన‌ది కాదు. నిజానికి ప్రపంచకప్‌లో ఈ ట్రెండ్ చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు ఫోటోషూట్ కోసం నిజమైన ట్రోఫీని ఐసీసీ అధికారులు గెలిచిన జ‌ట్టుకు ఇస్తారు. కానీ ఆ తర్వాత వారికి ప్రపంచ కప్ ప్రతిరూప ట్రోఫీ (డూప్లికేట్‌) ఇస్తారు. డూప్లికేట్‌ ట్రోఫీ దాదాపు అసలు ప్రపంచ కప్ ట్రోఫీని పోలి ఉంటుంది. టోర్నమెంట్ జరిగే సంవత్సరం లోగో ప్రతిరూప ట్రోఫీపై ఉంటుంది. అది ఆ టోర్నమెంట్ కోసం మాత్రమే రూపొందిస్తారు.

We’re now on WhatsApp : Click to Join

అయితే ఒరిజినల్ ట్రోఫీని కేవలం ఫొటో షూట్ కోసం మాత్రమే అందిస్తారు. విజేతలు తమ దేశానికి తీసుకెళ్లేందుకు అచ్చం అలాంటిదే ఇయర్, ఈవెంట్ లోగోతో డూప్లికేట్ సిల్వర్‌వేర్ ట్రోఫీని ఐసీసీ తయారుచేసి అందిస్తుంది. ఒరిజినల్ ట్రోఫీ దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఉంటుంది. ముంబైలో గురువారం సాయంత్రం 5 గంటలకు టీమిండియా విజయోత్సవ పరేడ్ ప్రారంభ‌మైంది. 17 ఏళ్ల తర్వాత నెరవేరిన ఈ కలను సంబరాలు చేసుకునేందుకు మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు భారీ సంఖ్యలో జనం పోటెత్తారు. టీమ్ ఇండియా ఆటగాళ్లు లేదా ప్రపంచ ఛాంపియన్‌లు ప్రత్యేక బస్సులో పరేడ్ చేస్తున్నారు.