India: ఉరకలేసే ఉత్సాహంతో ఫైనల్స్ చేరిన టీమిండియా (India) ఎందుకు ఆఖరి పోరాటంలో ఓడిపోయింది? సరిదిద్దుకోలేని తప్పులతో వందల కోట్లమంది ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరచటానికి కారణాలేమిటి? బ్యాటింగ్ వైఫల్యమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణమా? పిచ్‌ను అంచనా వేయటంలో పొరబడ్డామా? మనవాళ్లు మరికాసేపు క్రీజ్‌లో ఉంటే ఫలితం మరోలా ఉండేదా?
చివరికి నిరాశే మిగిలింది. కోట్లాది మంది భారతీయుల కల చెదిరింది. ప్రపంచ కప్ గెలవాలన్న అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. 2023 వరల్డ్ కప్‌లో తిరుగులేని విజయాలతో దూకుడుగా ఆడుతూ ఫైనల్లో అడుగుపెట్టిన టీమిండియా ఆఖరి పోరాటంలో తడబడింది. టఫ్ గేమ్‌లంటే ఆస్ట్రేలియా రెచ్చిపోతుంది. పైగా ఇలాంటి మెగా ఈవెంట్లంటే ఆసీస్ జట్టు ప్రాణం పెట్టేస్తుంది. ఈ ప్రపంచ కప్ ఫైనల్లోనూ అదే టీమ్ స్పిరిట్‌ను ఆస్ట్లేలియా కనబరిచింది.అనుకున్నట్టుగానే కోట్లాది మంది భారత జట్టు అభిమానుల అంచనాలను తల్లకిందులు చేసింది. మరో ప్రపంచ కప్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఇండియా ఓటమికి చాలాకారణాలున్నాయి.
Also Read: World Cup Winner Australia: ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా.. రన్నరప్ గా టీమిండియా..!
వ్యూహాత్మక తప్పిదాలు భారత్ ఓటమికి ప్రధాన కారణాలు. ఫేవరెట్ టీమ్ అనే ప్రెజర్ ఫ్యాక్టర్ కూడా టీమిండియాపై బాగా పని చేసింది. లీగ్ మ్యాచ్‌ల్లో చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోయిన ప్లేయర్లలో ఒక్క కోహ్లి మినహా చెప్పుకోదగ్గ రీతిలో ఆడిన బ్యాటర్ ఎవరూ లేకపోవటం భారత్‌కు పెద్ద మైనస్ అయింది. టాపార్డర్ మూడువికెట్లు మొదటి పది ఓవర్లలోనే పడిపోవటం మరో శాపంగా మారింది. వేగంగా ఆడి బిగ్ టార్గెట్ సాధించాలన్న రోహిత్ సేన గేమ్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆరంభంలోనే వికెట్ పడ్డా కెప్టెన్ రోహిత్ శర్మ అదే దూకుడు కొనసాగించకుండా ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నది విశ్లేషకుల అంచనా.
We’re now on WhatsApp. Click to Join.
These face hurts badly 😞#INDvAUS #INDvsAUS #AUSvIND#AUSvsIND #INDvAUSFinal #INDvsAUSfinalpic.twitter.com/hhaUJD9VvJ
— Dank jetha (@Dank_jetha) November 19, 2023
ఈ టోర్నీలో అంచనాలకు మించి రాణించిన కోహ్లీ ఫైనల్లో మరికాస్త నిలబడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయం. దీనికి తోడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా ఫెయిలవడం నిరాశ కలిగించింది. చివరి వరకూ పోరాడినా బిగ్ టోటల్ లేకపోవటం ఆస్ట్రేలియాకు అడ్వాంటేజ్ అయ్యాయి. అహ్మదాబాద్ పిచ్‌ను అంచనా వేయటంలోనూ భారత్ బోల్తాపడింది.
మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో పిచ్ అర్థం కాకుండా అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు సహకరించకపోయినా ఒత్తిడిని జయించిన బ్యాటర్లు మ్యాచ్‌ను అనుకూలంగా మరల్చుకుని కప్ ఎగరేసుకుపోయారు. టాస్ గెలిచినప్పటి నుంచే ఇండియాపై అప్పర్ హ్యాండ్ సాధించిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుని తాము తీసుకున్న నిర్ణయం తప్పు కాదన్న లెవెల్లో ఆడింది. ఆరంభంలో వికెట్లు పడగొట్టిన టీమిండియా పేస్ బౌలర్లును హెడ్, లబుషేన్ కాన్ఫిడెంట్‌గా ఎదుర్కొని ఆటను తమ వైపు తిప్పుకున్నారు. పక్కా ప్రొఫెషనలిజంతో అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మరల్చుకుని విశ్వ విజేత అయింది.