Hardik Pandya: దులీప్ ట్రోఫీ 2024 సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ఈ టోర్నీ సెప్టెంబర్ 22న ముగియనుంది. అయితే దులీప్ ట్రోఫీకి ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో 4 జట్లు ఆడతాయి. ఇందులో భారత జట్టులోని దాదాపు స్లార్, ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు కనిపించనున్నారు. కానీ ఈ టోర్నీలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. దీంతో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) టెస్టు కెరీర్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాండ్యా టెస్టు కెరీర్ ముగిసిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
వాస్తవానికి శివమ్ దూబే- నితీష్ రెడ్డి రూపంలో భారతదేశానికి ఇద్దరు మంచి ఆల్ రౌండర్ల ఎంపికలు ఉన్నాయి. శివమ్ దూబే, నితీష్ రెడ్డి బ్యాటింగ్ కాకుండా వేగంగా బౌలింగ్ చేయగలరు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు దులీప్ ట్రోఫీకి బీసీసీఐ అవకాశం కల్పించింది. శివమ్ దూబే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత్‌కు నిరంతరం ఆడుతున్నాడు. ఇదే సమయంలో నితీష్ రెడ్డి ఐపీఎల్‌లో తన సత్తాతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా చివరిసారిగా 6 సంవత్సరాల క్రితం 2018లో భారత్ తరఫున టెస్టు ఆడాడు. అప్పటినుంచి పాండ్యా టెస్టులు ఆడలేదు.
Also Read: Shravana Putrada Ekadashi: శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి..?
నిజానికి హార్దిక్ పాండ్యాకు గాయం సమస్యగా మారింది. ఈ వెటరన్ ఆల్ రౌండర్ నిరంతరం గాయాలతో పోరాడుతున్నాడు. దీంతోపాటు వన్డే, టీ20 జట్టులో నిరంతరం ఆడడం లేదు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత 3 ఫార్మాట్ రూల్ సీరియస్ గా ఫాలో అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నియమం ప్రకారం సంబంధిత ఆటగాడు నిర్దిష్ట ఫార్మాట్ కోసం ఎంపిక చేయబడతాడు. సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌లో ఆడాడు. కానీ వన్డే సిరీస్‌లో అవకాశం రాలేదు. హార్దిక్ పాండ్యాతో కూడా ఇదే జరిగితే అతను బహుశా ODI, T20 ఫార్మాట్లలో మాత్రమే ఆడటం చూడవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.