World Cup 2023: ప్రపంచ కప్ లో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు వెళ్లే..!

2023 ప్రపంచ కప్ అక్టోబర్ 5వ తేదీన గురువారం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో ఈ ఏడాది పది జట్లు తలపడబోతున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్,

World Cup 2023: 2023 ప్రపంచ కప్ అక్టోబర్ 5వ తేదీన గురువారం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో ఈ ఏడాది పది జట్లు తలపడబోతున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు ప్రారంభ మ్యాచ్ లో హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ విశ్లేషకులు ఇరు జట్ల ఆటగాళ్లపై ప్రెడిక్షన్స్ ఇస్తూ మరింత పెంచేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో జరిగిన ఆసక్తికర చర్చలో ప్రపంచ కప్ లో ఎవరెవరు ఇంపాక్ట్ ప్లేయర్స్ గా రాణిస్తారో తేల్చేశారు.

స్టార్ స్పోర్ట్స్ ఎక్స్ పర్ట్స్ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఆసక్తికర అంశాలపై చర్చ జరిపారు. ఈ మెగాటోర్నీలో ఎవరు టాప్ స్కోరర్ గా నిలుస్తారన్న విషయంలో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు చేస్తాడని చెప్పాడు. షేన్ వాట్సన్ టీమిండియా యువ ఆటగాడు గిల్ పేరును సూచించాడు. గిల్ పేరును సూచించిన వారిలో టీమిండియా వుమెన్స్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, పియూష్ చావ్లాతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు గిల్ పేరునే ఉద్ఘాటించారు.సౌతాఫ్రికా స్టార్ డేల్ స్టెయిన్ పాక్ కెప్టెన్ బాబర్ టాప్ స్కోరర్ గా నిలుస్తాడని చెప్పాడు. గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేరును ఎన్నుకున్నాడు, ఇర్ఫాన్ పఠాన్ విరాట్ పేరును సూచించారు. కాగా ఎక్స్ పర్ట్శ్ ప్రిడిక్షన్ లో ఎక్కువమంది గిల్ ని సెలెక్ట్ చేశారు. నిజానికి గిల్ 2023 సంవత్సరంలో అద్భుతంగ రాణించాడు. మూడు ఫార్మెట్లలోనూ గిల్ చెలరేగి ఆడాడు. 2023లో గిల్ 19 వన్డే మ్యాచ్ లు ఆడి 1220 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలతో పాటుగా 5 అర్దశతకాలు ఉన్నాయి.

Also Read: Hyderabad: కాంగ్రెస్‌‌కు బిగ్ షాక్..