ఐపీఎల్ (IPL)లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 23న) జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించగా, RCB ఆడిన ఆరు మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించింది. రెండు జట్లూ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాయి. అయితే బ్యాటింగ్, స్పిన్ అనుకూలమైన బెంగళూరు పిచ్‌ను చూస్తే ఈ జట్లు తమ ప్లే-11లో అదనపు స్పిన్నర్‌కు అవకాశం ఇవ్వవచ్చు.
పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..?
బెంగళూరు పిచ్ ఎప్పుడూ బ్యాట్స్‌మెన్‌కు సహకరిస్తుంది. ఇక్కడ బౌండరీ లెంగ్త్ కూడా తక్కువగా ఉన్నాయి. దాని కారణంగా ఇక్కడ సిక్సర్లు సులభంగా కొట్టొచ్చు. 200+ స్కోర్‌ని ఛేజింగ్ చేయడం ఇక్కడ చాలా కష్టంగా అనిపించదు. ఇక్కడ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లు కొంత సహాయం పొందుతారు. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్ల ఎకానమీ రేట్ చాలా బాగుంది. నేటి మ్యాచ్‌కు ముందు పిచ్‌పై తేలికపాటి పాచెస్, పచ్చటి గడ్డి కనిపించినప్పటికీ ఇది ఫాస్ట్ బౌలర్‌లకు కూడా సహాయపడగలదు.
ఈ రెండు జట్లు ఇప్పటివరకు 27 సార్లు తలపడగా, ఇందులో రాజస్థాన్ 12 మ్యాచ్‌లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్‌లు గెలిచాయి. రెండు మ్యాచ్‌లు ఫలితాలు తేలలేదు. ఐపీఎల్ 2022లో ఈ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. ఈ మూడింటిలో తొలి మ్యాచ్ బెంగళూరు పేరు మీద ఉండగా, చివరి రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయం సాధించింది. గత సీజన్‌లో ఆర్‌సీబీ తొలి టైటిల్ కలను రాజస్థాన్ బ్రేక్ చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆర్‌సిబిని ఓడించి టోర్నీ నుండి నిష్క్రమించింది.
నేటి మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ రాయల్స్ పైచేయి కాస్త భారీగానే కనిపిస్తోంది. ఈ జట్టు ఛాంపియన్‌గా ఆడుతోంది. రాజస్థాన్ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడగా 4 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు నెట్ రన్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. మరోవైపు ఆర్‌సీబీ జట్టు విజయ జోరును కొనసాగించలేకపోతోంది. ఒక మ్యాచ్‌లో గెలిస్తే తర్వాతి మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో RCB ఇప్పటి వరకు 3 విజయాలు, 3 ఓటములు చవిచూసింది.