Rajasthan Vs Punjab: నేడు రాజస్థాన్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్.. రెండో విజయం కోసం ఇరు జట్లు ఫైట్..!

ఐపీఎల్ 16వ సీజన్ 8వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ (Rajasthan Vs Punjab) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ నేడు (బుధవారం) సాయంత్రం గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

  • Written By:
  • Publish Date - April 5, 2023 / 08:03 AM IST

ఐపీఎల్ 16వ సీజన్ 8వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ (Rajasthan Vs Punjab) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ నేడు (బుధవారం) సాయంత్రం గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. కొత్త సీజన్‌ను రెండు జట్లూ అద్భుతంగా ప్రారంభించాయి. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు ఈ హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకపక్షంగా 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇందులో జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్ కాకుండా కెప్టెన్ సంజు శాంసన్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో జట్టు బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్ కొత్త బంతితో చాలా మంచి ఆరంభాన్ని అందించారు.

మరోవైపు పంజాబ్ కింగ్స్ గురించి చెప్పాలంటే శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వారు కొత్త సీజన్‌ను గొప్పగా ప్రారంభించారు. తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భానుక రాజపక్సే, కెప్టెన్ ధావన్ బ్యాటింగ్‌తో పంజాబ్‌కు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇది కాకుండా అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీసి బౌలింగ్‌లో రాణించాడు.

Also Read: Shreyas Iyer: WTC ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. శ్రేయాస్ అయ్యర్‌ దూరం.. కారణమిదే..?

రాజస్థాన్ రాయల్స్ జట్టు జైపూర్‌తో పాటు గౌహతిలోని బరస్పరా స్టేడియంను తమ రెండో హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంది. తొలిసారిగా ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఆడిన 6 టీ20 మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 150 పరుగుల వద్ద నమోదైంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు. తద్వారా లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చు.

ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే.. ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు జరగగా ఇందులో రాజస్థాన్ జట్టు 14 గెలుపొందగా, పంజాబ్ 9 మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. పంజాబ్ జట్టులోకి రబడా రాకతో వారి బౌలింగ్ మరింత పటిష్టంగా కనిపిస్తోంది.