ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2023లో 12వ మ్యాచ్ ఏప్రిల్ 8న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (Mumbai Indians vs Chennai Super Kings) మధ్య జరగనుంది. రాత్రి 7. 30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ఆరంభం మెరుగ్గా లేదు. ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. మరోవైపు విజయాల పరంపర కొనసాగించాలని చెన్నై జట్టు భావిస్తోంది.
పిచ్ నివేదిక
ముంబైలోని వాంఖడే స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంది. ఇక్కడ బంతి సులభంగా బ్యాట్‌పైకి వస్తుంది. బౌలర్లకు ఇక్కడ పెద్దగా సాయం అందదు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ముంబైలో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేసే జట్టుకు లాభిస్తుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రను పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్,చెన్నై సూపర్ కింగ్స్ వంటి రెండు జట్లు నిలకడగా రాణిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడానికి ఇదే కారణం. ఇరు జట్ల మధ్య ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగాయి. లక్నో సూపర్ కింగ్స్‌పై విజయం సాధించిన తర్వాత CSKలో విజయాల ఊపు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైతో జరిగే మ్యాచ్‌లో చెన్నై గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ జట్టు (అంచనా): రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్ (wk), సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (అంచనా): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (c & wk), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, RS హంగర్గేకర్