Site icon HashtagU Telugu

KKR vs SRH: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ.. హోరాహోరీ పోరు తప్పదా..?

KKR vs SRH

Resizeimagesize (1280 X 720)

ఐపీఎల్ 16వ సీజన్‌లో 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. రెండు జట్లూ తమ చివరి మ్యాచ్‌లో అద్భుతంగా గెలిచాయి. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధించింది. ప్రస్తుతం కోల్‌కతా జట్టు నెట్ రన్ రేట్ 1.375. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వారు తమ మొదటి 2 మ్యాచ్‌లలో ఏకపక్ష ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో ఆ జట్టు తమ మూడో లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి విజయం ఖాతా తెరిచింది. హైదరాబాద్ జట్టు నెట్ రన్‌రేట్ -1.502గా ఉంది.

పిచ్ నివేదిక

రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతుంది. ఇక్కడ పిచ్ గురించి చెప్పాలంటే దానిపై బ్యాటింగ్ చేయడం చాలా సులభం. ఈ కారణంగానే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరును చూడొచ్చు. ఈ మైదానంలో ఇప్పటి వరకు 79 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా లక్ష్యాన్ని ఛేదించిన జట్టు 47 సార్లు గెలిచింది. ఇది కాకుండా మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 162 పరుగులకు దగ్గరగా ఉంది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు హైదరాబాద్‌తో కేకేఆర్ జట్టు 23 మ్యాచ్‌లు ఆడగా అందులో 15 మ్యాచ్‌లు గెలిచి 8 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి చవిచూసింది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్‌ల విషయానికొస్తే.. అందులోనూ కోల్‌కతాదే పైచేయి. KKR అక్కడ 4-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లలో ఒకటి సూపర్ ఓవర్‌లో కూడా నిర్ణయించబడింది.

Also Read: Kagiso Rabada: ఈ ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించిన కగిసో రబడా.. మలింగాను వెనక్కి నెట్టి..!

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు (అంచనా): రహ్మానుల్లా గుర్బాజ్ (WK), నారాయణ్ జగదీశన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (C), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (C), హెన్రిచ్ క్లాసెన్ (WK), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్