ఐపీఎల్ 2023 (IPL 2023)లో ఆదివారం (ఏప్రిల్ 9) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య ఒక్క ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే జరిగింది. ఐపీఎల్ 2022లో జరిగిన ఆ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడాయి. గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సులువైన విజయాలు నమోదు చేసింది. అదే సమయంలో కోల్‌కతా తన తొలి మ్యాచ్‌లో ఓడి, రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ ఆటగాడు జాసన్ రాయ్ కూడా జట్టులో చేరడం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం.
అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంది..?
అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు సులువుగా ఉంటుంది. అయినప్పటికీ ఫాస్ట్ బౌలర్లకు ఇక్కడ కొంత సహాయం లభిస్తుంది. పిచ్‌పై స్వల్పంగా బౌన్స్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్ల సామర్థ్యంపై వీటి వినియోగం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడ ఛేజింగ్ టీమ్ సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 178 పరుగులు చేసింది. దీనిని గుజరాత్ టైటాన్స్ సులభంగా సాధించింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లోనూ అలాంటిదే జరగొచ్చు.
Also Read: Ajinkya Rahane: ఆడిన తొలి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించిన రహానే.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
గత ఐపీఎల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా ఛాంపియన్ గానే ఆడుతోంది. ఈ సీజన్‌లో గుజరాత్ తన రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ చాలా సులభంగా గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టు సమతూకంతో ఉంది. మరోవైపు కోల్‌కతా జట్టులో నమ్మకమైన బ్యాట్స్‌మెన్ లేరు. రాయ్ రాకతో ఈ జట్టు బ్యాటింగ్ కచ్చితంగా పటిష్టంగా ఉండొచ్చని, ఓవరాల్ గా అంచనా వేస్తే మాత్రం ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.
గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనా: వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అంచనా: జాసన్ రాయ్, నారాయణ్ జగదీషన్, రహ్మానుల్లా గుర్బాజ్ (WK), నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి