Site icon HashtagU Telugu

GT vs RR: నేడు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌ మధ్య హోరాహోరీ మ్యాచ్.. రాజస్థాన్ రాజసం కొనసాగేనా..?

Rr

Rr

సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఐపీఎల్ 2023లో 23వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans)తో తలపడనుంది. హార్దిక్ పాండ్యా పునరాగమనంతో గుజరాత్ మళ్లీ గెలుపుబాట పట్టడంతో ఆ జట్టు గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

సంజూ శాంసన్ నాయకత్వంలో రాజస్థాన్ ప్రదర్శన ఈ సీజన్‌లో ఇప్పటివరకు బాగానే ఉంది. గత మ్యాచ్‌లో చెపాక్‌ మైదానంలో రాజస్థాన్‌ జట్టు 15 ఏళ్ల తర్వాత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్‌పై కూడా అదే ఫామ్‌ను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఆ జట్టు ఢీకొంటుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం ఇరు జట్ల మధ్య పోటీ కూడా ఉంటుంది. ప్రస్తుతం పట్టికలో రాజస్థాన్ నంబర్ వన్ స్థానంలో ఉండగా, గుజరాత్ మూడో స్థానంలో ఉంది.

రాజస్థాన్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే.. జోస్ బట్లర్ తన బ్యాట్‌తో IPL 2023లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై బట్లర్ 52 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో అతని భాగస్వామి యశస్వి జైస్వాల్ బ్యాట్ కూడా ఈ సీజన్‌లో రాణిస్తుంది. బౌలింగ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజువేంద్ర చాహల్‌ స్పిన్‌ మాయాజాలం ఉంది. అయితే, సందీప్ శర్మ మినహా జట్టులోని పేస్ విభాగం సరైన లయలో కనిపించటంలేదు. అయితే ఐపీఎల్‌లో ఇప్పటివరకు గుజరాత్, రాజస్థాన్ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. మూడు సందర్భాల్లో GT విజేతగా నిలిచింది.

Also Read: Virat Kohli- Ganguly: మరోసారి బయటపడ్డ కోహ్లీ-గంగూలీ మధ్య విభేదాలు.. గంగూలీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కోహ్లీ నిరాకరణ.. వీడియో వైరల్..!

మరోవైపు గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాట్ పరుగులు తీస్తోంది. గిల్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 183 పరుగులు చేశాడు. అదే సమయంలో గత సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ ఫినిషర్లుగా అద్భుతంగా రాణించారు.

గుజరాత్ టైటాన్స్ జట్టు (అంచనా): వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.

రాజస్థాన్ రాయల్స్ జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురైల్, జాసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.