ఐపీఎల్‌లో నేటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తలపడుతోంది. పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు మూడో స్థానంలో, హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ప్లేఆఫ్ రేసులో వెనుకబడకుండా ఉండాలంటే హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనుకుంటోంది. అయితే, ఓవరాల్ రికార్డ్ నుండి ఇటీవలి ఊపు, కొన్ని ఆసక్తికరమైన గణాంకాల వరకు, ప్రతిదీ హైదరాబాద్‌కు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
హోం గ్రౌండ్ మ్యాచ్‌లో ఓడిపోయిన ఆరెంజ్ ఆర్మీ నేడు చెన్నైతో చెపాక్‌లో జరిగే మ్యాచ్‌లో విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ చెన్నై మీద గెలవడం అంత ఈజీ కాదని ఫ్యాన్స్ అంటున్నారు. అంతే కాకుండా చెన్నై నేడు హోం గ్రౌండ్ చెపాక్‌లో ఆడనుంది. అసలే చెన్నై తన చివరి మ్యాచ్‌ను గెలిచి మాంచి ఊపు మీదుంది. ఈరోజు సాయంత్రం 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. CSK, SRH మధ్య ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో SRH కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. 14 మ్యాచ్‌ల ఫలితాలు CSKకి అనుకూలంగా వచ్చాయి. గత 5 మ్యాచ్‌ల గురించి చెప్పాలంటే.. వీటిలో కూడా నాలుగు మ్యాచ్‌లు CSK గెలుపొందింది. అంటే హెడ్ టు హెడ్ రికార్డులో చెన్నై జట్టు ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయిస్తోంది.
Also Read: Ben Stokes: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్ న్యూస్.. నేటి మ్యాచ్ కు బెన్ స్టోక్స్ సిద్ధం..!
చెపాక్‌లో CSK, SRH జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. CSKకి ఇదే హోమ్ గ్రౌండ్. ఇక్కడ గత 10 ఏళ్లలో కేవలం రెండు జట్లు మాత్రమే చెన్నైని ఓడించగలిగాయి. ఇక్కడ CSKపై ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మాత్రమే చెన్నైని ఓడించాయి. ఇటువంటి పరిస్థితిలో SRH.. CSKను ఓడించడం అంత సులభం కాదు. పై గణాంకాలలో CSK ఆధిపత్యం చెలాయించింది. దీనితో పాటు ప్రస్తుతం CSK బలంగా ఉంది. ఈ సీజన్‌లో CSK ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించగా, SRH తమ ఐదు మ్యాచ్‌లలో మూడింటిలో ఓడిపోయింది. అయితే, రెండు జట్ల లైనప్ చూస్తే మాత్రం సమ పోటీ ఉంటుంది. రెండు జట్లలోనూ బలమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. బౌలింగ్‌లో, ఫాస్ట్ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ జట్టు ముందుంది. చెన్నైకి మంచి స్పిన్నర్ల సైన్యం ఉంది. చెపాక్‌లో స్పిన్నర్లు ప్రభావవంతంగా ఉన్నారు.