Mumbai Vs Hyderabad : నామమాత్రపు పోరులో గెలిచేదెవరు ?

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ నామమాత్రపు పోరు జరుగనుంది.

Published By: HashtagU Telugu Desk
Rohit Williamson

Rohit Williamson

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ నామమాత్రపు పోరు జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచినా, ఓడినా ఒరిగేదేమీ లేదు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 పరాజయాలతో లీగ్‌ నుంచి ఇదివరకే నిష్క్రమించగా, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ప్లే ఆఫ్స్‌ రేసు నుండి నిష్క్రమించింది. ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు ముఖాముఖి 10 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్‌ల్లో గెలిపొందింది.

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే.. నేటి మ్యాచ్‌లో రెండు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన తిలక్ వర్మ, రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్ , హ్రితిక్ మంచి టచ్ లో ఉండగా.. బౌలర్లలో డానియల్ సంస్, రిలే మెరిడిత్, కుమార కార్తికేయ చక్కగా రాణిస్తున్నారు. ఇక వరుస ఓటుములతో డీలా పడ్డ సన్ రైజర్స్ ముంబైపై గెలిచి పరాజయాలకి బ్రేక్ వేయాలని పట్టుదలగా ఉంది. ఇక బ్యాటింగ్‌ పరంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లు సమష్టిగా విఫలమవుతుండగా.. బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అన్ని విభాగాల్లో గాడిన పడితే తప్ప విజయం సాధించడం కష్టమే.
మరోవైపు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్ సీజన్ ను విజయాలతో ముగించెందుకు ఎదురు చూస్తోంది.

  Last Updated: 17 May 2022, 09:45 AM IST