RCB vs LSG Match Prediction: ఆర్సీబీ వర్సెస్ లక్నో… గెలుపెవరిది ?

ఈ సారి భారీ ఆశలతో ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన ఆర్సీబీ తొలి మ్యాచ్ లో చెన్నై చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థి జట్టు చెన్నై కావడం, ధోనీ, కోహ్లీ మధ్య మంచి బాండింగ్ కారణంగా ఆ మ్యాచ్ ని ఫ్యాన్స్ పెద్దగా కన్సిడర్ చేయలేదు.

RCB vs LSG Match Prediction: ఈ సారి భారీ ఆశలతో ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన ఆర్సీబీ తొలి మ్యాచ్ లో చెన్నై చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థి జట్టు చెన్నై కావడం, ధోనీ, కోహ్లీ మధ్య మంచి బాండింగ్ కారణంగా ఆ మ్యాచ్ ని ఫ్యాన్స్ పెద్దగా కన్సిడర్ చేయలేదు. తర్వాత పంజాబ్‌పై నెగ్గినా.. మళ్లీ వెంటనే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఇలా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో రెండో ఓటములతో పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ఈ క్రమంలోనే లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌కు సిద్ధం అవుతోంది.

పంజాబ్ కింగ్స్‌ను ఓడించి లక్నో జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. దీంతో ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. అర్సబిలో ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ, దినేష్‌ కార్తీక్‌ మినహా ఎవరూ పెద్దగా ఫామ్లో లేరు. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌ లాంటి ఆటగాళ్లు కూడా రాణించలేకపోతున్నారు. వారికి తోడు వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన కామెరున్‌ గ్రీన్‌, అల్జారీ జోసెఫ్‌లు కూడా దారుణంగా నిరాశపరుస్తున్నారు. దీంతో ఆర్సీబీ చాలా వీక్‌ గా కనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగంలో ఆర్సీబీ అత్యంత చెత్త టీంగా ప్రొజెక్ట్ చేస్తునాన్రు సీనియర్లు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ తదుపరి మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్ లో భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

We’re now on WhatsAppClick to Join.

గత మూడు మ్యాచ్ ల్లో అల్జారీ జోసెఫ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3.4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్నాడు. కేకేఆర్‌పై 2 ఓవర్లలో ఏకంగా 34 పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో లక్నోతో జరిగే మ్యాచ్‌లో అల్జారీ జోసెఫ్‌కు విశ్రాంతి కల్పించే అవకాశముంది.అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ లేదా విల్ జాక్స్‌ను తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఫాస్ట్ బౌలర్ ఫెర్గూసన్ డెత్ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేయగలడు. జాక్స్ ఆఫ్ స్పిన్‌తో పాటు బ్యాటుతోనూ సత్తాచాటగలడు. వీరిద్దరిలో ఫెర్గూసన్‌ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయ్‌కుమార్ వైశాక్‌ను జట్టులోకి తీసుకురావడానికి ఆర్సీబీ ప్రయత్నిస్తుంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ, లక్నో నాలుగు సార్లు తలపడ్డాయి. ఆర్సీబీ 3 మ్యాచులో గలవగా, ఓ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది.

Also Read: Nara Lokesh : మంగళగిరిలో లోకేష్‌ గెలుపు పక్కా.. ఈ వీడియోనే నిదర్శనం..!