KKR New Mentor: గత ఐపీఎల్ ఎడిషన్కు ముందు కేకేఆర్ టీం మేనేజ్మెంట్ గౌతమ్ గంభీర్ను మెంటర్ గా అపాయింట్ చేసింది. ఆ నిర్ణయం జట్టు తలరాతనే మార్చేసింది. సునీల్ నరైన్ లాంటి ఒక ఆల్ రౌండర్ ని ఓపెనర్ గా దించి సక్సెస్ అయ్యాడు గంభీర్. గతేడాది ఐపీఎల్ లో కేకేఆర్ కప్ గెలుచుకుందంటే నరైన్ ఒక కారణం. నరైన్ క్రీజులో ఉంటే బౌలర్లు హడలెత్తిపోయారు. ఎక్కడో చివర్లో బ్యాటింగ్ చేసే నరైన్ని గంభీర్ ఏరికోరి ఓపెనర్ గా దించి ఫ్రాంచైజీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఫలితంగా 10 సంవత్సరాల తర్వాత కేకేఆర్ ఐపిఎల్ ఛాంపియన్‌గా నిలిచింది.
తొలుత గంభీర్‌ను చాలా కాలం పాటు మెంటార్‌గా ఉంచాలని కేకేఆర్ భావించింది. కానీ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్ గా పదవి బాధ్యతలు తీసుకోవడంతో కేకేఆర్ మెంటర్ పోస్ట్ ఖాళీ అయింది. గౌతమ్ నిష్క్రమణ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త మెంటార్ కోసం వెతుకుతోంది. రాహుల్ ద్రవిడ్ జట్టుకు తదుపరి మెంటార్‌గా ఉండొచ్చన్న వార్తలు వచిన్నప్పటికీ ఇప్పుడు మరో వ్యక్తి పేరు వినిపిస్తుంది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్‌ను కేకేఆర్ తన మెంటార్‌గా అపాయింట్ చేయనున్నట్లు తెలుస్తుంది. క
ల్లిస్ గతంలో కేకేఆర్ టీంలో ఆడాడు 2012, 2014లో గంభీర్ కెప్టెన్సీలో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ రెండు సీజన్లలో కల్లిస్ సభ్యుడుగా ఉన్నాడు.దీంతో పాటు జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అందువల్ల కేకేఆర్ ఈ అనుభవజ్ఞుడిని తదుపరి సీజన్‌లో మెంటార్‌గా చేసే అవకాశం ఉంది. 2011 మరియు 2014 మధ్య, అతను జట్టు కోసం 56 మ్యాచ్‌ల్లో 1295 పరుగులు చేశాడు. 2015లో బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. జాక్వెస్ కల్లిస్ వయసు 48 ఏళ్లు మాత్రమే. అతను ప్రపంచంలోని గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడు. ఇప్పటికీ ఫిట్‌గా ఉండి సీనియర్ ఆటగాళ్ల టోర్నీల్లో ఆడుతున్నాడు. కల్లీస్‌కు బ్యాటింగ్, బౌలింగ్‌లో నైపుణ్యం ఉంది. వివాదాలకు దూరంగా ఉంటూ యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందువల్ల గౌతమ్ గంభీర్ స్థానంలో కేకేఆర్ మెంటార్ పదవికి కలిస్ తగిన వ్యక్తి అని చెప్పడంలో సందేహం లేదు. అతని 3 దశాబ్దాల క్రికెట్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని క్రికెట్ అనలిస్టులు చెప్తున్నారు.
Also Read: Anderson Retirement: అండర్సన్ కి లెజెండ్స్ వీడ్కోలు