Champions Trophy Semi-Final: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఇప్పుడు టోర్నీలో మూడు జట్లు సెమీస్‌కు (Champions Trophy Semi-Final) చేరాయి కూడా. గ్రూప్ A నుండి టీమ్ ఇండియా, న్యూజిలాండ్ సెమీ-ఫైనల్‌కు టిక్కెట్‌లను పొందగా, గ్రూప్ B నుండి ఆస్ట్రేలియా కూడా తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఏర్పడిన సమీకరణాలతో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.
మార్చి 4న టీం ఇండియా తన సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది
బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను ఓడించి సెమీస్‌లో చోటు ఖాయం చేసుకుంది టీమిండియా. మార్చి 2న న్యూజిలాండ్‌తో లీగ్ దశలో రోహిత్ సేన తన చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత మార్చి 4న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీ ఆరంభం నుంచే టీమిండియా సెమీఫైనల్ ఆడితే.. దాని మ్యాచ్ దుబాయ్‌లో మాత్రమే జరుగుతుందని తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లాహోర్ మైదానంలో జరగనుంది. సెమీస్‌లో టీమ్‌ఇండియాతో ఏ జట్టు తలపడుతుందనేది తదుపరి 2 మ్యాచ్‌ల్లో తేలనుంది.
Also Read: Air India Express: సామాన్యులకు బంపరాఫర్.. కేవలం రూ. 1385కే ఫ్లైట్ టికెట్!
భారత్-ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్?
న్యూజిలాండ్‌తో జరిగే చివరి గ్రూప్ దశలో రోహిత్ శర్మ జట్టు గెలిస్తే గ్రూప్-ఎలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. గ్రూప్ బిలో 2వ ర్యాంక్‌లో ఉన్న జట్టుతో భారత జట్టు తలపడవచ్చు. ఈరోజు దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌పై గెలిస్తే గ్రూప్-బిలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇదే జరిగితే మార్చి 4న ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌ను టీమిండియా ఆడనుంది. న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించి, ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా కూడా ఓడిపోతే సెమీ ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడవచ్చు.
సమీకరణాలు
- దక్షిణాఫ్రికా మార్చి 1న ఇంగ్లండ్‌ను ఓడించాలి.
- భారత జట్టు మార్చి 2న న్యూజిలాండ్‌ను ఓడించాలి.
- గ్రూప్ ఏలో భారత్ అగ్రస్థానంలో నిలవగా, గ్రూప్ బీలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలుస్తుంది.
పై విధంగా జరిగితే ట్రోఫీలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు
- మొదటి సెమీ-ఫైనల్ – మార్చి 4: భారత్ vs ఆస్ట్రేలియా
- రెండవ సెమీ-ఫైనల్ – మార్చి 5: దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్
టీమిండియా దక్షిణాఫ్రికాతోనూ తలపడే అవకాశం
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి, ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోతే, తొలి సెమీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. న్యూజిలాండ్‌ను భారత్ ఓడించినా, ఆఫ్రికన్ జట్టు ఇంగ్లండ్‌తో ఓడిపోయినా, ఈ రెండు జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి.