England Tour: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పుడు టీం ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ 2025లో ఆడుతున్నారు. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌లో (England Tour) పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తదుపరి సైకిల్‌ను పరిశీలిస్తే ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ టీమ్ ఇండియాకు చాలా ముఖ్యమైనది. ఆఖరి 2 టెస్టుల సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. ఆసీస్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓడిపోగా.. అంతకంటే ముందు న్యూజిలాండ్ జట్టు మీద స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడిపోయింది. దీంతో టీమ్ ఇండియా తొలిసారిగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూరమైంది.
ఇదే సమయంలో ఇంగ్లండ్ టూర్‌లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఎవరు ఉంటారన్నపై ఇప్పుడు చర్చ మొదలైంది. గత కొంత కాలంగా రెడ్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ చాలా పేలవ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో నిరంతర అపజయాల తర్వాత, రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో కూడా ఆడటం కనిపించింది.
Also Read: Pochampally Srinivas Reddy : వెంటాడుతున్న కోడిపందేల కేసు.. పోచంపల్లికి మరోసారి పోలీసుల నోటీసులు
మాజీ క్రికెటర్ రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు
టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ ప్రదర్శన పేలవంగా ఉంది. గత 15 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ 10.93 సగటుతో 164 పరుగులు మాత్రమే చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో అతని బ్యాట్ నుండి 6 ఇన్నింగ్స్‌లలో 31 పరుగులు మాత్రమే వచ్చాయి. పేలవమైన బ్యాటింగ్ కారణంగా రోహిత్ సిడ్నీ టెస్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పటికీ టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ హిట్‌మ్యాన్‌కు మద్దతు ఇచ్చాడు.
స్పోర్ట్స్ టాక్‌తో నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. మీరు రోహిత్‌ని ప్రశ్నించలేరు. మీరు రోహిత్ సామర్థ్యాన్ని ఎలా అంచనా వేస్తారు? రోహిత్ అన్ని అంచనాలను అందుకొన్నాడు. టెస్టు క్రికెట్‌లో ఆటగాళ్ల అసలు రంగు బయటపడుతుంది. మీ బలహీనతలు బహిర్గతమవుతాయి. విరాట్, రోహిత్‌లు ఇంగ్లండ్‌లో ఆడటం చాలా ముఖ్యం. ఇద్దరికీ అనుభవం ఉంది అని చెప్పుకొచ్చాడు.
భారతదేశంలో 10 మంది ఉంటే వారికి 20 విభిన్న అభిప్రాయాలు ఉంటాయని నవజ్యోత్ పేర్కొన్నారు. చివరి క్షణంలో మీరు టెస్టు ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్‌గా చేయగలరు? కెప్టెన్సీకి ఎవరూ లేరు. రోహిత్‌కు అనుభవం ఉంది. రోహిత్‌ని భర్తీ చేయలేరు. ఇంగ్లండ్‌లో అతని రికార్డు బలంగా ఉందని గుర్తు చేశారు.
ఈ రోజు సిరీస్‌లో తొలి మ్యాచ్ జరగనుంది
ఈ ఏడాది జూన్‌లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ జూన్ 20న జరగనుంది. ఇది కాకుండా సిరీస్ చివరి మ్యాచ్ జూలై 31 నుండి ఆగస్టు 4 వరకు లండన్‌లో జరుగుతుంది.